Vaibhav Suryavanshi : దంచికొట్టిన వైభవ్.. 14 ఏళ్ల వయస్సులో ప్రపంచ రికార్డులు..!
ప్రధానాంశాలు:
Vaibhav Suryavanshi : దంచికొట్టిన వైభవ్.. 14 ఏళ్ల వయస్సులో ప్రపంచ రికార్డులు..!
Vaibhav Suryavanshi : గుజరాత్ టైటాన్స్ పై మెరుపు సెంచరీ సాధించిన రాజస్థాన్ రాయల్స్ టీనేజర్ వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 101, 7 ఫోర్లు, 11 సిక్సర్లు) పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. గుజరాత్ పై 14 ఏళ్ల 32 రోజుల వయసులో సెంచరీ చేసిన వైభవ్.. గతంలో ఇండియాకే చెందిన విజయ్ జోల్ (18 ఏళ్ల 118 రోజులు) పేరిట ఉన్న రికార్డును తిరగ రాశాడు.

Vaibhav Suryavanshi : దంచికొట్టిన వైభవ్.. 14 ఏళ్ల వయస్సులో ప్రపంచ రికార్డులు..!
Vaibhav Suryavanshi రికార్డులే రికార్డులు..
ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్ గాను వైభవ్ రికార్డులకెక్కాడు. కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్.. గతంలో యూసుఫ్ పఠాన్ (37 బాల్స్) ముంబై ఇండియన్స్ పై చేసిన రికార్డును తిరగ రాశాడు. ఓవరాల్ గా ఈ అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. ఐపీఎల్లో అత్యంత పిన్న వయస్కులో సెంచరీ చేసిన రికార్డును కూడా వైభవ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
టీ20ల్లో ఫిఫ్టీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ గాను రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ కుమారుడు మసన్ ఐసాకిల్ పేరిట ఉండేది. తను 15 ఏళ్ల 360 రోజుల వయసులో ఆఫ్గాన్ లోకల్ లీగ్ అయిన స్వాగీజా లీగ్ లో ఈ రికార్డును నమోదు చేశాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సూర్యవంశీ.. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఒక్కసారిగా టాప్ గేర్ లోకి వెళ్లాడు. వెటరన్ ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఏకంగా 28 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సిక్సర్లు, 2 ఫోర్లు ఉండటం విశేషం. 35 బంతుల్లో సెంచరీ చేశాక ఆఖరికి ప్రసిధ్ కృష్ణకు వికెట్ సమర్పించుకున్నాడు. మొత్తం మీద ఈ మ్యాచ్ ద్వారా రాయల్స్ తిరిగి విజయాల బాట పట్టింది