Virat Kohli : పాక్ మ్యచ్‌తో రికార్డులే రికార్డులు.. దటీజ్ కింగ్ కోహ్లీ…!
ప్రధానాంశాలు:
Virat Kohli : పాక్ మ్యచ్‌తో రికార్డులే రికార్డులు.. దటీజ్ కింగ్ కోహ్లీ...!
Virat Kohli : ఛాంపియన్స్ ట్రోఫీలో Champions Trophy భాగంగా దాయాదులతో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ క్రికెటర్ Indian Cri విరాట్ కోహ్లీ Virat Kohli ఓ రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో పాక్ ఆటగాడు నసీమ్ షా క్యాచ్ పట్టడంతో వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్ లు పట్టిన క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పటివరకు వన్డేల్లో విరాట్ కోహ్లీ 157 క్యాచ్ లు పట్టాడు. ఇక వన్డేల్లో 14 వేల పరుగులు పూర్తి చేసిన రెండవ భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.

Virat Kohli : పాక్ మ్యచ్‌తో రికార్డులే రికార్డులు.. దటీజ్ కింగ్ కోహ్లీ…!
Virat Kohli ది గోట్ కింగ్ కోహ్లీ..
ఇక తాజా సెంచరీతో కోహ్లీ వన్డేలో 51వ మార్కుకి చేరుకున్నాడు. ఇక పాకిస్థాన్‌పై ఇది కోహ్లీకి 4వ వన్డే సెంచరీ. ఇక ఐసీసీ వన్డే ICC ODI ఈవెంట్స్‌లో ఎక్కువ సెంచరీలు(6) చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరిట ఉంది. అలానే ఈ మ్యాచ్‌లో కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఇలా ఒకటేంటి విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ కింగ్ కోహ్లీ అనిపించుకుంటున్నాడు.
విరాట్ కోహ్లీ మొత్తం 299 మ్యాచుల్లో 57.8 సగటుతో 14వేల పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రానున్న రోజులలో విరాట్ కోహ్లీ మరిన్ని రికార్డ్స్ Records క్రియేట్ చేయడం ఖాయం అని ఆయన ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌తో ఒక్కసారిగా ఫామ్‌లో రావడమే కాకుండా కీలక ఘట్టాలను ఆవిష్కరించడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్‌గా ఉన్నారు.