Virat Kohli : ఒక్క‌రు కూడా మెసేజ్ చేయ‌లేదు.. ఘాటు వ్యాఖ్య‌లు చేసిన కోహ్లీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virat Kohli : ఒక్క‌రు కూడా మెసేజ్ చేయ‌లేదు.. ఘాటు వ్యాఖ్య‌లు చేసిన కోహ్లీ

 Authored By sandeep | The Telugu News | Updated on :5 September 2022,3:30 pm

Virat Kohli : భార‌త క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ఆన‌తి కాలంలోనే స్టార్ క్రికెట‌ర్‌గా ఓ వెలుగు వెలిగిన కోహ్లీ ఎన్నో రికార్డులు త‌న పేరిట లిఖించుకున్నాడు. అయితే కొంత కాలంగా ఫామ్ లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న కోహ్లీ ఆసియాకప్‌లో వరుసగా రెండు అర్ధసెంచరీలు సాధించి ‘ఫామ్‌ టెంపరరీ.. క్లాస్‌ పర్మినెంట్’ అన్న మాటను మరోసారి నిజం చేశాడు.దీంతో రానున్న రోజుల‌లో కోహ్లీ స‌రికొత్త రికార్డ‌లు సెట్ చేయ‌డం ఖాయం అని అంద‌రు భావించారు. కాగా నిన్న పాక్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న విరాట్‌ ఎమోషనల్‌ అయ్యాడు.

Virat Kohli : గ‌డ్డు పరిస్థితులు..

గత కొన్ని నెలలుగా తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా ఎంఎస్ ధోనీని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. తాను టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పుడు కేవలం ధోని మాత్రమే తనకు వ్యక్తిగతంగా మెసేజ్‌ చేశాడని గుర్తు చేశాడు. ‘నేను టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పుడు నాకు ఫస్ట్ మెసేజ్‌ ధోని భయ్యా నుంచి వచ్చింది. నేను అంతకు ముందు కలిసి ఆడిన వారందరిలో కేవలం అతనొక్కడే నాకు వ్యక్తిగతంగా మెసేజ్‌ చేశాడు. నా నెంబర్ చాలా మంది దగ్గర ఉన్నది. కానీ కేవలం ఎంఎస్ మాత్రమే మెసేజ్‌ చేశాడు. ఇద్దరి ఆటగాళ్ల మధ్య గౌరవం ఉన్నప్పుడే ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుంది. నాకు ఎప్పుడు కావాలనుకున్నా ఎంఎస్‌డీని వ్యక్తిగతంగా చేరుకోగలను’ అని ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు కోహ్లీ.

Virat Kohli Comments After India Vs Pakistan Match

Virat Kohli Comments After India Vs Pakistan Match

ఎవరో ఒకరి గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటే నేరుగా వారికే చెబుతాను. ప్రపంచం ముందు బహిరంగంగా వారికి సూచనలు ఇస్తే, నా ఉద్దేశ్యం ప్రకారం వాటికి ఏ మాత్రం విలువ ఉండదు. నా పురోగతి కోసమే చెప్పేట్టు అయితే నేరుగా నన్నే చేరుకోవాలి’’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇక కోహ్లీ పాక్‌పై అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడిన గెల‌వ‌లేక‌పోయింది. సూపర్ 4 రౌండ్‌లో తన తదుపరి మ్యాచ్‌లల్లో ప్రత్యర్థికి చుక్కలు చూపించేలా ఉంది. ఈ నెల 6న శ్రీలంక, 8వ తేదీన ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడాల్సిఉంది. ఈ మ్యాచ్‌ల‌లో భార‌త్ నెగ్గి ఫినాలేకి చేరాల‌నిఅనుకుంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది