Virat Kohli : T20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీ ఫైనల్ లో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ..!!
Virat Kohli : T20 వరల్డ్ కప్ టోర్నీ చాలా రసవతారంగా సాగుతోంది. సెమీఫైనల్ లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా… మొదట బ్యాటింగ్ కి దిగిన ఇండియా 20 ఓవర్లకి ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసి … జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.
అయితే ఈ టోర్నీ జరగకముందు భారత బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లో లేని సంగతి తెలిసిందే. ఆ సమయంలో చాలామంది విరాట్ ఆట తీరుపై విమర్శలు చేశారు. కానీ ఈ టోర్నీలో ఐదు మ్యాచ్ లకి మూడు మ్యాచ్ లలో హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో 40 పంతులలో 50 పరుగులు చేశారు.
దీంతో అంతర్జాతీయ టి20 టోర్నీలో 4 వేల పరుగులు చేసి అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. ఇప్పటివరకు 115 అంతర్జాతీయ టీ20లు ఆడిన కోహ్లీ 4008 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండగా, 37 అర్ధ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 122. తరువాతి స్థానాల్లో వరుసగా.. రోహిత్ శర్మ(3853), మార్టిన్ గుప్టిల్(3531), బాబర్ ఆజాం(3323) ఉన్నారు.