Virat Kohli : విరాట్ కోహ్లీని ఆ మూడు విషయాలు చాలా వెనక్కి నెట్టాయి..!
Virat Kohli : రన్ మెషీన్ విరాట్ కోహ్లీ virat kohli దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన శనివారం సాయంత్రం సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. నేను ఎప్పుడూ ప్రతి విషయంలోనూ 120% దోహదపడాలని కోరుకుంటానని, అలా చేయలేకపోతే అది తప్పునని విరాట్ అన్నాడు. ఇప్పటికే టీ20, వన్డే లీడర్‌షిప్ నుంచి కూడా దిగిపోయిన విరాట్ ఇకపై అన్ని ఫార్మాట్లలో ఓ సీనియర్ ప్లేయర్‌గా టీమ్‌లో ఉంటాడు.ధోని తప్పుకున్న తర్వాత టెస్ట్ పగ్గాలు అందుకున్న కోహ్లీ తనదైన శైలిలో దూసుకెళ్లాడు. ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ అంతే విమర్శలు అందుకున్నాడు.
ది బెస్ట్ పేస్ అటాక్‌గా మార్చిన కోహ్లీ.. బ్యాటింగ్‌ను మాత్రం బలహీనం చేశాడనే ఆరోపణలున్నాయి. సీనియర్ బ్యాట్స్‌మెన్స్‌కి వెనకేసుకొచ్చిన కోహ్లీ కుర్ర బ్యాట్స్‌మెన్స్‌కి అస్సలు అవకాశాలు ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. సీనియర్ ఆటగాళ్లను వెనకేసుకురావడం వల్ల యువ ఆటగాళ్లకు తీరని అన్యాయం చేసిన కెప్టెన్‌గా కూడా కోహ్లీ ముద్ర వేసుకున్నాడు.ఏడేళ్ల విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్‌కు నిరాశే ఎదురైంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఖంగుతిన్న టీమిండియా..
virat kohli : మాయని మచ్చలా మారిన కొన్ని అంశాలు…
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ దెబ్బకు సెమీస్‌కే పరిమితమైంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ న్యూజిలాండ్ చేతిలోనే ఓడింది. ఇక 2021 టీ ప్రపంచకప్‌లో అయితే కనీసం లీగ్ స్టేజ్ కూడా ధాటలేకపోయింది. ఈ ఓటములు విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ప్రశ్నించాయి. బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్‌ని తీర్చిదిద్దిన కోహ్లీ యువ బ్యాట్స్‌మెన్స్‌ని ప్రోత్సహించలేకపోయాడు.