Virat Kohli : దయచేసి నన్ను టీంకి ఎంపిక చేయోద్దంటూ వేడుకుంటున్న విరాట్ కోహ్లీ
Virat Kohli : ఒకప్పుడు టీమిండియా కెప్టెన్‌గా రన్ మెషీన్‌గా అనేక రికార్డులు కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ఇప్పుడు టీంలో చోటు దక్కించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు. తనకెంతో ఇష్టమైన టెస్టు ఫార్మాట్ లోనూ కోహ్లీ తడబడుతున్నాడు. రెండేళ్ల నుంచి ఒక్క సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన ఐదో టెస్టులోనూ విరాట్ రెండు ఇన్నింగ్స్ ల్లో నిరాశ పరిచాడు. వరుసగా పేలవమైన ప్రదర్శనలు కనబర్చుతున్న కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అవుతోంది. అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ చాన్నాళ్ల నుంచి పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్ తో సిరీస్ ఆడుతోన్న టీమిండియా.. అనంతరం వెస్టిండీస్ జట్టుతో వన్డే, టి20 మ్యాచ్ లను ఆడనుంది. అందుకోసం బీసీసీఐ ఇప్పటికే వన్డే సిరీస్ కోసం జట్టును ప్రకటించింది. రోహిత్, విరాట్ లాంటి సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన సెలెక్టర్లు కెప్టెన్ గా శిఖర్ ధావన్ ను ఎంపిక చేసింది. ఫామ్ లో లేని కోహ్లీ.. టి20 మ్యాచ్ లకు కూడా తనను సెలెక్ట్ చేయొద్దంటూ సెలక్షన్ కమిటీకి విజ్ఞప్తి చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. తనకు విశ్రాంతి కావాలని, అందుకోసమే తనను విండీస్ తో జరిగే టి20 సిరీస్ కోసం ఎంపిక చేయొద్దని కోహ్లీ కోరినట్లు ఆ అధికారి తెలిపాడు.
Virat Kohli : కోహ్లీకి ఎంత కష్టం వచ్చే..
విండీస్ పర్యటన అనంతరం జరిగే సిరీస్ లకు తాను అందుబాటులో ఉంటానని కోహ్లీ పేర్కొనడం విశేషం. కోహ్లీ స్థానం కోసం దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ లు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో కోహ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. లేదంటే టి20 ప్రపంచకప్ లో చోటు దక్కించుకున్నా తుది జట్టులో ఆడే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి. ఇక, లేటెస్ట్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ కింగ్ కోహ్లీ మరోసారి దిగజారిపోయాడు. వరుసగా పేలవమైన ప్రదర్శనలు కనబర్చుతున్న కోహ్లీ.. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్‌కు పడిపోయాడు.