Virat Kohli : వందో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీకి బీసీసీఐ బంపర్ ఆఫర్.. తిరస్కరించిన విరాట్
Virat Kohli : టీమిండియా టెస్టు సారథిగా విరాట్ కోహ్లీ తప్పుకుంటున్నట్టు శనివారం (జనవరి 15) ప్రకటించి అందరికి భారీ షాక్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం.. విరాట్ సోషల్ మీడియాలో ఈ అనూహ్య ప్రకటన చేశాడు. దీంతో మూడు ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. మూడు నెలల్లో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఇప్పుడు పెద్ద సంచలంగా మారింది. కోహ్లీ నిర్ణయంపై టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ కూడా షాక్‌కు గురయ్యాడట.కోహ్లీ నిర్ణయాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
అంతేకాదు బీసీసీఐపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. అయితే టెస్టు కెరీర్‌లో ఇప్పటికే 99 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 100వ టెస్టుని ఫిబ్రవరిలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకతో ఆడనున్నాడు. ఐపీఎల్‌లో మొదటి నుంచి రాయల్ బెంగళూరు టీమ్‌కి ఆడుతున్న విరాట్ కోహ్లీకి చిన్నస్వామి స్టేడియంతో మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆ 100వ టెస్టుని కెప్టెన్ వీడ్కోలు మ్యాచ్‌లా ఘనంగా నిర్వహిస్తామని బీసీసీఐ ఆఫర్ ఇచ్చింది.ఆంగ్ల వార్తాపత్రిక హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం , ఒక సీనియర్ బీసీసీఐ అధికారి కోహ్లీకి టెస్ట్ కెప్టెన్‌గా వీడ్కోలు మ్యాచ్‌ను ఆఫర్ చేశాడు.
Virat Kohli : వందో టెస్ట్‌కి బంపర్ ఆఫర్..!
కానీ, కోహ్లీ దానిని తిరస్కరించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.ఈ ఆఫర్‌ను తిరస్కరించిన కోహ్లి.. ‘ఒక్క మ్యాచ్ వల్ల ఎలాంటి తేడా ఉండదు. నేను అలానే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా, కోహ్లీ స్థానంలో ఎవరిని భర్తీ చేయాలన్నది పెద్ద ప్రశ్నగా మారింది. రోహిత్ శర్మ ఫిట్‌నెస్, టెస్టు రికార్డుల దృష్ట్యా అతడ్ని కెప్టెన్‌గా ప్రకటించలేని పరిస్థితి. అలానే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇంకా కెప్టెన్‌గా నేర్చుకునే దశలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. విరాట్ కోహ్లీని ఒప్పించేందుకు బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినట్లు తెలిసింది.