Virat Kohli : నేను అలా ఉన్నప్పుడు క్రికెట్ నుండి తప్పుకుంటా.. విరాట్ కోహ్లీ సంచలన కామెంట్స్
Virat Kohli : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తాను క్రికెట్ ఆడే విషయమై సంచలన కామెంట్స్ చేశాడు. టీ 20 వరల్డ్ కప్ కెప్టెన్‌గా దిగిపోయిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు విరాట్ కోహ్లీ.. టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. నమీబియాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. అయినప్పటికీ టీమిండియా సెమిస్ ఆశలు ఆవిరి కావడంతో ఆ మ్యాచ్ గెలుపు పెద్దగా ప్రయోనం చేకూర్చలేదు. దీంతో టీ ట్వంటీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి, హెడ్ కోచ్‌గా రవిశాస్త్రికి టీమిండియా వీడ్కోలు పలికింది.
నమీబియాతో ఆడిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత విరాట్, రవిలకు వీడ్కోలు పలకడం విశేషం. అనంతరం మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. తాను ఇప్పుడు చాలా రిలీఫ్‌గా ఫీలవుతున్నానని, టీ ట్వంటీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవమని తెలిపాడు. టీ ట్వంటీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే బాధ్యతను తాను వదిలేసి ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. మెగా టోర్నీలో అనుకున్న ఫలితాలు రాలేదని తనకు తెలుసని, అయితే, తాము బాగానే ఆడామని, టీ ట్వంటి క్రికెట్ భిన్నమైందని వివరించాడు. ఈ క్రమంలోనే రవిశాస్త్రికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన కోహ్లీ.. తన ఆటలో దూకుడు తగ్గదన్నాడు.
Virat Kohli : ఇప్పుడు తనకు రిలీఫ్‌గా ఉందంటున్న విరాట్ కోహ్లీ..
తాను ఒక వేళ అలా ఆడలేకపోతే ఆ రోజు నుంచి క్రికెట్ ఆడటం మానేస్తానని చెప్పాడు. తాను కెప్టెన్ కాకముందు నుంచీ ఆటపైన దృష్టి పెట్టానని విరాట్ కోహ్లీ తెలిపాడు. మిగతా ఆటలతో పోలిస్తే టీ ట్వంటీ ఆట భిన్నమైందని, తొలి రెండు మ్యాచులలో ఎవరైతే పై చేయి సాధిస్తారో వారి ఆధిపత్యమే కొనసాగుతుందని, వారే విజేతలుగా నిలిచే చాన్సెస్ ఉంటాయని కోహ్లీ తెలిపాడు. తొలి రెండు మ్యాచులలో తాము మిస్సయ్యామని కోహ్లీ ఒప్పుకున్నాడు.