Virat Kohli : పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ షూ లేస్ కట్టిన విరాట్ కోహ్లీ.. ఇది కదా స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్ అంటున్న నెటిజన్స్
ప్రధానాంశాలు:
Virat Kohli : పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ షూ లేస్ కట్టిన విరాట్ కోహ్లీ.. ఇది కదా స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్ అంటున్న నెటిజన్స్
Virat Kohli : ఎన్నో రోజులుగా పాక్- భారత్ Ind Vs Pak మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ దొరికింది. ICC Champions Trophy ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దాయాదీ పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బంతితో కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ Virat Kohli శతక్కొట్టాడు.

Virat Kohli : పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ షూ లేస్ కట్టిన విరాట్ కోహ్లీ.. ఇది కదా స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్ అంటున్న నెటిజన్స్
Virat Kohli గొప్ప క్రీడా స్పూర్తి..
హైఓల్టేజ్ మ్యాచ్ కాస్త ఏక పక్షంగా మారింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏ నుంచి టీమిండియా సెమీస్ Semi Finals వెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్టార్ క్రికెటర్ కోహ్లీ మైదానంలో దూకుడు ప్రదర్శిస్తూ ఉంటాడు. అయితే ఆయన పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో గొప్ప క్రీడాస్ఫూర్తిని కనబరిచాడు . పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆట మొదటి సగం సమయంలో విరాట్ కోహ్లీ నసీమ్ షా షూ లేస్‌లు కట్టాడు.
నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోతూ ఉండగా నసీమ్ షా Naseem Shah కూడా బ్యాట్‌తో తన సత్తా ప్రదర్శించాల్సి వచ్చింది . అయితే ఆ సమయంలో అతని షూ లేస్ ఊడిపోవడంతో విరాట్ నిజమైన క్రీడాకారుడిగా, చాలా వినయం మరియుతో ససీమ్ షా షూ లేస్ కట్టాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పిక్ చూసిన వారందరు కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.