Virat Kohlli : భారత క్రికెట్‌లో ఏం జరుగుతోంది.. కోహ్లీ వ్యాఖ్యలకు సౌరవ్ గంగూలీ సమాధానమేంటీ?
Virat Kohlli : భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దక్షిణా ఫ్రికా పర్యటనకు వెళ్లే ముందర ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై వస్తున్న పలు వార్తలపై విరాట్ కోహ్లీ సమాధానమిచ్చారు. అయితే, కోహ్లీ వ్యాఖ్యల్లో సౌరవ్ గంగూలీ సెల్ఫ్ డిఫెన్స్‌లో పడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాను కోహ్లీతో కెప్టెన్సీ తొలగిచడం గురించి మాట్లాడానని సౌరవ్ గంగూలీ ఇటీవల ఓ ఇంటర్వ్యలో తెలిపాడు. కానీ, దాదా తనతో అసలు అటువంటి విషయాల గురించి ప్రస్తావనే చేయలేదని విరాట్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తనకు, రోహిత్ శర్మకు విభేదాలున్నాయని వస్తున్న వార్తలన్నిటినీ విరాట్ కోహ్లీ ఖండించారు.
Virat Kohlli : కెప్టెన్సీపై భిన్నమైన వాదనలు.
అటువంటి వార్తల్లో అస్సలు నిజం లేదని, తాను, రోహిత్ శర్మ క్రికెటర్స్ గా కలిసే ఉన్నామని కోహ్లీ స్పష్టం చేశారు.విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలతో భారత క్రికెట్‌లో అసలేం జరుగుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు ఎలా మాట్లాడుతారని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే మీడియా సాక్షిగా విరాట్ కోహ్లీ భారత సెలక్టర్లపై చేసిన విమర్శలు చర్చనీయాంశమవుతున్నాయి. తాను వన్డేల్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాననే విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యల గురించి చర్చ జరుగుతున్నది.ఈ నెల 26 నుంచి భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య మూడు టెస్టు సిరీస్ జరగనున్నాయి.
ఈ క్రమంలోనే ఈ నెల 16న భారత క్రికెట్ టెస్టు టీమ్ సౌతాఫ్రికాకు బయలు దేరనుంది.విరాట్ కోహ్లీ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు అందరి వేళ్లు సౌరవ్ గంగూలీ వైపు వెళ్తున్నాయి. కోహ్లీ వ్యాఖ్యలకు దాదా ఏం సమాధానం చెప్తారనే ఆసక్తి నెలకొంది. ఈ విషయమై మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఈ విషయమై దాదాను అడుగుతున్నారు. భారత క్రికెట్ అభివృద్ధి చెందాలని ఆశించే సౌరవ్ గంగూలీ కోహ్లీ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని,అసలు ఇండియన్ క్రికెట్ లో ఏం జరుగుతుందనే ప్రశ్నలకు ఇకపై రాకుండా చేయాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ అంటున్నారు.