World Cup Winner : 1987 లో జన్మించిన కెప్టెన్ ఉన్న దేశానిదే ఈసారి వరల్డ్ కప్.. అంటే ఈసారి వరల్డ్ కప్ గెలుచుకునేది ఆ దేశమేనా?
World Cup Winner : వన్డే ప్రపంచకప్ కు సమరం మొదలైంది. ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. క్రికెట్ లవర్స్ అయితే వరల్డ్ కప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరి చూపు ఈ టోర్నమెంట్ పై పడింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. నిజానికి.. ఈ వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అందుకే భారత క్రికెట్ అభిమానులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. తొలి మ్యాచ్.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగబోతోంది. 2019 లో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో గెలిచిన ఇంగ్లండ్ డిఫెండింగ్ చాంపియన్ గా ఈసారి బరిలోకి దిగబోతోంది. అంతే కాదు.. గత వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఈ రెండు దేశాల మధ్య తొలి పోరు జరగనుంది.
ఇదంతా పక్కన పెడితే.. సైంటిఫిక్ ఆస్ట్రాలజర్ గ్రీన్ స్టోన్ లోబో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే.. ఈ సారి వరల్డ్ కప్ లో ఎవరు గెలుస్తారో ఆయన ముందే చెప్పేశారు. అసలు వరల్డ్ కప్ ఇంకా స్టార్ట్ కాలేదు కానీ.. అప్పుడే వరల్డ్ కప్ లో ఎవరు గెలుస్తారో లోబో చెప్పేశాడు. ఇంతకీ ఆయన అంచనాలు ఏంటంటే.. 1987 వ సంవత్సరంలో పుట్టిన వాళ్లు.. ఏ జట్టుకు అయితే కెప్టెన్ గా ఉన్నారో వాళ్లే, ఆ దేశమే ఈ సారి వరల్డ్ కప్ ట్రోఫీ గెలవబోతోందట. ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఉన్న జట్లలో బంగ్లాదేశ్, భారత్ ఈ రెండు దేశాల కెప్టెన్లు ఇద్దరూ 1987 లోనే జన్మించారు.
World Cup Winner : వరల్డ్ కప్ బంగ్లాదేశ్ దా లేక భారత్ దా?
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 1987 లో జన్మించాడు. కానీ.. బంగ్లాదేశ్ జట్టు అంత గొప్పగా ఆడేదేం లేదు. కానీ.. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 1987 లోనే జన్మించాడు. అంటే బంగ్లాదేశ్ కాకపోతే ఇక గెలిచేది భారత్ జట్టు అని చెప్పకనే చెప్పేశాడు లోబో. నిజానికి భారత్ ఈ సారి సొంత గడ్డపై ఎలాగైనా వరల్డ్ కప్ ట్రోఫీని సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈనేపథ్యంలో 2011 నాటి ఫలితాన్ని మళ్లీ పునరావృతం చేయాలన్న పట్టుదలతో ఉంది. ఇక.. టీమిండియా తొలి పోరు ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. అక్టోబర్ 8న ఈ మ్యాచ్ జరగనుంది.