Sunrisers Hyderabad : సన్‌రైజర్స్ హైదరాబాద్ త్వరలో పేరు మారబోతుందా..?
ప్రధానాంశాలు:
Sunrisers Hyderabad : సన్‌రైజర్స్ హైదరాబాద్ త్వరలో పేరు మారబోతుందా..?
Sunrisers Hyderabad : సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భవిష్యత్తు గురించి గత కొన్ని రోజులుగా పెద్ద చర్చ నడుస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)తో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌కు జరిగిన విభేదాల కారణంగా ఈ జట్టు వైజాగ్‌కు మారిపోతుందా అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి ఉచిత పాసుల పంపిణీ విషయంలో హెచ్‌సీఏతో విబేధాలు తలెత్తాయి. ఈ వివాదం పెరిగి రాష్ట్ర ప్రభుత్వ దాకా వెళ్లడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అయితే, చివరికి రెండు వర్గాలు పరస్పర అంగీకారంతో 10% టికెట్ల పాసులు కేటాయించేందుకు ఒప్పందం చేసుకున్నాయి.

Sunrisers Hyderabad : సన్‌రైజర్స్ హైదరాబాద్ త్వరలో పేరు మారబోతుందా..?
Sunrisers Hyderabad : సన్‌రైజర్స్ హైదరాబాద్ కాస్త సన్‌రైజర్స్ వైజాగ్ కాబోతుందా..?
ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును తమ రాష్ట్రానికి ఆహ్వానించడం కొత్త చర్చకు దారి తీసింది. హెచ్‌సీఏతో సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో ACA తరఫున సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేక పన్ను రాయితీలు, ఉచిత మైదానం అందజేయడం వంటి ప్రయోజనాలను కూడా ACA ప్రతిపాదించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రానికి ఐపీఎల్ జట్టు రావాలని ఆసక్తిగా ఉందని, అందుకే ఈ ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ తరలింపుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు ఏదీ విడుదల కాలేదు.
ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ తమ ప్రాతినిధ్యాన్ని మార్పు చేయాలంటే, బీసీసీఐ అనుమతి అవసరం. గతంలో సన్‌రైజర్స్ జట్టు కొన్నిసార్లు వైజాగ్‌లో మ్యాచ్‌లు ఆడినా, రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా మిగిలిపోయింది. దీంతో, ప్రస్తుత పరిస్థితిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్రాతినిధ్యాన్ని మార్చుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు అనిపిస్తోంది. పైగా ఈ వివాదం తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించి మారుతున్నందున సీఎం రేవంత్ రెడ్డి దీనిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరలింపుపై ఇంకా స్పష్టత రాకపోయినా ఈ చర్చలు మాత్రం క్రికెట్ వర్గాల్లో చురుకుగా కొనసాగుతున్నాయి.