Xiaomi 12 Pro : అమెజాన్ లో బంపర్ ఆఫర్ .. అతి తక్కువ ధరకే Xiaomi ఫోన్ ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Xiaomi 12 Pro : అమెజాన్ లో బంపర్ ఆఫర్ .. అతి తక్కువ ధరకే Xiaomi ఫోన్ ..!!

Xiaomi 12 Pro : తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్లో Xiaomi 12 pro స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తుంది. దీని అసలు ధర రూ. 84,999. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పై 47% ఫ్లాట్ ఆఫర్ ను అమెజాన్ అందిస్తుంది. అంటే నేరుగా 40 వేలు […]

 Authored By aruna | The Telugu News | Updated on :14 August 2023,8:00 pm

Xiaomi 12 Pro : తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్లో Xiaomi 12 pro స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తుంది. దీని అసలు ధర రూ. 84,999. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పై 47% ఫ్లాట్ ఆఫర్ ను అమెజాన్ అందిస్తుంది. అంటే నేరుగా 40 వేలు తగ్గింపును అందిస్తుంది. ఈ ఆఫర్ కింద కేవలం 44,999కి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా కొన్ని బ్యాంక్ ఆఫర్లతో, ఎక్సేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్ ను మరింత తక్కువ ధరకు పొందవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో 2000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.

అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కూడా 2000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఆ రెండు బ్యాంకుల నుండి కార్డులు లేకుంటే HSBC క్యాష్ బ్యాక్ కార్డ్ క్రెడిట్ కార్డ్ మాత్రమే ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ పై 5% తగ్గింపు లభిస్తుంది. ఇక ఈ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే 42,749 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ కండిషన్, మోడల్ ను బట్టి విలువ మారుతుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ ను ఎంచుకునే ముందు పాత స్మార్ట్ ఫోన్ సరిగా ఉందో లేదో దానిలో ఎటువంటి నష్టం లేదని నిర్ధారించుకోవాలి.

amazon bumper offer on Xiaomi 12 Pro smartphones

amazon bumper offer on Xiaomi 12 Pro smartphones

అలాగే మీ ఏరియాలో ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి పిన్ కోడ్ ని కూడా నమోదు చేయాలి. ఇకపోతే ఈ షావోమి 12 ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియాలో డిసెంబర్ 2021 లో లాంచ్ అయింది. అయితే ఇప్పుడు కొనాల వద్దా అనే సందేహం వచ్చే ఉంటుంది. ఈ ఫోన్ వల్ల లాభాలు మరియు నష్టాలు తెలుసుకోవడం ద్వారా సరైన నిర్ణయానికి రావచ్చు. ఈ ఫోన్లో డిస్ప్లే ప్రధాన ప్లస్ పాయింట్. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ఆరు అంగుళాల అమోలేడ్ డిస్ప్లేను కలిగి ఉంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది