Amazon : రూ.8వేలకే స్మార్ట్ టీవీ… ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే…
Amazon : ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తుంది. ఈ సెల్ లో ఎన్నో ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని రకాల ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ లను అందిస్తుంది. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లను అందిస్తుంది అమెజాన్. కొన్ని స్మార్ట్ టీవీ లపై ఏకంగా 64% డిస్కౌంట్ ఇస్తుంది. అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో భాగంగా పలు స్మార్ట్ టీవీలపై బెస్ట్ ఆఫర్స్ టీవీల ఫీచర్స్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1) MI 5A Series LED TV: ఎమ్ఐ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ టీవీ పై ఏకంగా 56% డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
ఈ టీవీ అసలు ధర రూ.24,999 కాగా ఆఫర్లో భాగంగా రూ.10,990 కే లభిస్తుంది. అంతేకాకుండా ఎస్బిఐ డెబిట్ కార్డుతో ఈటీవీ ని కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ వస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి యాప్ లను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 720p రిజల్యూషన్ తో కూడిన ఎల్ఈడి డిస్ప్లే ను అందించారు. వైఫై, యూఎస్బీ, ఈతర్ నెట్, హెచ్డిఎమ్ఐ వంటి కనెక్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. 2) Amazon Basics Smart LED TV: అమెజాన్ బేసిక్స్ నుంచి వచ్చిన ఈ 32 ఇంచుల స్మార్ట్ టీవీ పై ఏకంగా 63% డిస్కౌంట్ లభిస్తుంది.
టీవీ అసలు ధర రూ.27,000 అయితే ఆఫర్లో భాగంగా 10,999 కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు కార్డుతో అదనంగా 10% డిస్కౌంట్ వస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో నెట్ ఫ్లిక్స్, సోనీ లీవ్, అలెక్స్, అమెజాన్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్ యాప్ లకు సపోర్ట్ చేస్తుంది. 720పి రిజల్యూషన్ తో కూడిన డిస్ప్లేను అందించారు. 3) Mi 32 inches Horizon Edition: అమెజాన్ సెల్లో భాగంగా ఈ స్మార్ట్ టీవీ పై 25% డిస్కౌంట్ లభిస్తుంది ఈటీవీ అసలు ధర 19,990, కాగా డిస్కౌంట్ లో భాగంగా రూ.14,990 కి కొనుగోలు చేయవచ్చు. ఎస్బిఐ క్రెడిట్ కార్డుతో 10 శాతం అదనపు డిస్కౌంట్ ఉంది.
ఈటీవీలో 20 వాట్స్ స్టీరియో స్పీకర్స్ అందించారు. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. 4) Redmi 32 inches Android 11 series HD ready LED smart TV: అమెజాన్ సేల్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ టీవీలో రెడ్ మీ స్మార్ట్ టీవీ ఒకటి. ఈటీవీ పై ఏకంగా 64% డిస్కౌంట్ లభిస్తుంది. ఈటీవీ అసలు ధర 24,990 కాదా డిస్కౌంట్ లో భాగంగా 8,999 కి అందుబాటులో ఉంది. ఎస్బిఐ కార్డుతో అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అన్ని రకాల ఆప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది స్మార్ట్ టీవీలో 20 వాట్స్ పవర్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి.