Bsnl Offer : బీఎస్ఎన్ఎల్ క‌స్ట‌మ‌ర్స్‌కి అదిరిపోయే ఆఫ‌ర్.. ఫ్రీగా 450+ టీవీ ఛానెల్స్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bsnl Offer : బీఎస్ఎన్ఎల్ క‌స్ట‌మ‌ర్స్‌కి అదిరిపోయే ఆఫ‌ర్.. ఫ్రీగా 450+ టీవీ ఛానెల్స్ !

 Authored By ramu | The Telugu News | Updated on :7 February 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Bsnl Offer : బీఎస్ఎన్ఎల్ క‌స్ట‌మ‌ర్స్‌కి అదిరిపోయే ఆఫ‌ర్.. ఫ్రీగా 450+ టీవీ ఛానెల్స్ !

Bsnl Offer : ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన వినియోగదారుల కోసం ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఆఫ‌ర్స్ ప్ర‌క‌టిస్తూ వినియోగ‌దారుల‌ని సంతోష‌ప‌రుస్తుంది. ఈ క్ర‌మంలో చాలా మంది బీఎస్ఎన్ఎల్ వైపే చూస్తున్నారు. ఇటీవల ఈ సంస్థ BiTVని ప్రారంభించింది. ఇది డైరెక్ట్-టు-మొబైల్ టీవీ సేవ, 450 కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లకు యాక్సెస్ అందిస్తుంది. ఓటీటీ ప్లే భాగస్వామ్యంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పుడు తన మొబైల్ వినియోగదారులకు ఈ సేవను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.

Bsnl Offer బీఎస్ఎన్ఎల్ క‌స్ట‌మ‌ర్స్‌కి అదిరిపోయే ఆఫ‌ర్ ఫ్రీగా 450+ టీవీ ఛానెల్స్

Bsnl Offer : బీఎస్ఎన్ఎల్ క‌స్ట‌మ‌ర్స్‌కి అదిరిపోయే ఆఫ‌ర్.. ఫ్రీగా 450+ టీవీ ఛానెల్స్ !

Bsnl Offer గొప్ప అవ‌కాశం..

బీఎస్ఎన్ఎల్‌ లైవ్ మొబైల్ టీవీ సేవ గత నెలలో పుదుచ్చేరిలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది.ఇప్పుడు మొబైల్ వినియోగదారులకు ప్రీమియంతో సహా 450 కంటే ఎక్కువ ప్రత్యక్ష టీవీ ఛానెల్‌లకు ఉచితంగా అందిస్తుంది. దీని ద్వారా బీఎస్ఎన్ఎల్‌ వినియోగదారులు ఇప్పుడు తమ స్మార్ట్‌ఫోన్లలోనే 450 కంటే ఎక్కువ ఛానెల్‌లను ఉచితంగా చూడవచ్చు. దీని ద్వారా భక్తిఫ్లిక్స్, షార్ట్‌ఫండ్లీ, కాంచా లంకా, స్టేజ్, ఓం టీవీ, ప్లే ఫిక్స్, Fancode, Distro, Hubhopper, Runn TV వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లతో పాటు 450 కంటే ఎక్కువ ప్రత్యక్ష టీవీ ఛానెల్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఉచితంగా చూడవచ్చు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ తన అధికారిక X హ్యాండిల్ ద్వారా రూ.99ని అందిస్తోంది. చౌకైన వాయిస్-ఓన్లీ ప్లాన్ ఉన్న వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా బీఐటీవీని ఆస్వాదించవచ్చు. దీని అర్థం బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఎటువంటి అదనపు డబ్బు ఖర్చు చేయకుండా తమ స్మార్ట్‌ఫోన్‌లలో ప్రత్యక్ష టీవీ ఛానెల్‌లను చూడవచ్చు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టెలికాం కంపెనీలను సరసమైన వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను అందించాలని ఆదేశించిన తర్వాత ఈ చర్య వచ్చింది.బీఐటీవీ పైలట్ దశలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 300కి పైగా ఉచిత టీవీ ఛానెళ్లను అందించింది. ఇప్పుడు ఈ సర్వీస్‌ అన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్ కార్డులతో పూర్తిగా అనుసంధానించి ఉంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది