Flipkart Offers : ఫ్లిప్ కార్ట్ లో కళ్ళు చెదిరే ఆఫర్స్.. రూ.48 వేల టీవీ కేవలం రూ.17 వేలకే…!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 15 October 2022, 8:00 am

Flipkart Offers : మీరు కొత్త టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే పండుగ సీజన్ లు కావడంతో ఆన్ లైన్ లో భారీ డిస్కౌంట్ లభిస్తున్నాయి. తక్కువ ధరకే మంచి టీవీని కొనుగోలు చేయవచ్చు. ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ టీవీల పై భారీ ఆఫర్లను అందిస్తుంది. పలు రకాల కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఆఫర్లు అక్టోబర్ 16 వరకే అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఫ్లిప్ కార్ట్ లో టిసిఎల్ కంపెనీకి చెందిన ఐ ఫాల్కన్ బ్రాండ్ టీవీలపై భారీ తగ్గింపు లభిస్తుంది. 43 ఇంచుల అల్ట్రా హెచ్డి 4k ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ పై భారీ డిస్కౌంట్ ను సొంతం చేసుకోవచ్చు.

ఏకంగా 60 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ టీవీ అసలు ధర 47,990. అయితే ఫ్లిప్ కార్ట్ లో కేవలం 18, 999 కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎస్బిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కార్డులపై 10% తగ్గింపు లభిస్తుంది. అంటే 1750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇప్పుడు ఈ టీవీ ధర రూ.17,249 కే వస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ పై నో కాస్ట్ ఈఎంఐ, ఈఎంఐ వంటి ప్రయోజనాలు పొందవచ్చు. ఎస్బిఐ కార్డ్ ద్వారా ఈ టీవీని కొంటే 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు 3167 చెల్లించాల్సి ఉంటుంది.

Flipkart offers big discount on smart tv

Flipkart offers big discount on smart tv

అదే ఈఎంఐ అయితే 12 నెలల వరకు నెలకు రూ.1706 చెల్లించాల్సి ఉంటుంది. 9 నెలల ఈఎంఐ అయితే నెలకు 2237 చెల్లించాలి. క్రెడిట్ కార్డు లేకపోయినా ఈ టీవీని ఈఎంఐ లో కొనవచ్చు. దీనికోసం ఫ్లిప్ కార్ట్ పే లెటర్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాలి. 12 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు 1797 కట్టాలి. 9 నెలలకు అయితే నెలకు రూ.2328 కట్టాలి. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై 36 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ.659 చెల్లించాలి. 24 నెలలకు అయితే 931 చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ టీవీలో 4కే యూహెచ్ డి, హెచ్డి ఆర్ 10 4కే అప్ స్కేలింగ్, మైక్రో డిమ్మింగ్ , ఏఐ వాయిస్ ఇంటర్ యాక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి