
Jio : చైనా కంపెనీలనే బీట్ చేసిన జియా.. ప్రముఖ టెలికాం సంస్థలో సరికొత్త రికార్డ్..!
Jio : ప్రముఖ టెలికాం సంస్థ జియో రోజు రోజుకి అంచెలంచెలుగా ఎదుగుతూ సరికొత్త రికార్డ్‌లు నమోదు చేస్తుంది. సాధారణంగా ఓ వ్యవస్థ సక్సెస్ కావాలి అంటే ప్రజల సపోర్ట్ తప్పనిసరి కావాలి. ఆర్ధిక విజయాల్లో కూడా ప్రజల భాగస్వామ్యం ఉంటుంది. రిలయన్స్ జియో విషయంలో కూడా అదే జరిగింది. ఇటీవల రిలయన్స్ జియో టారిఫ్ ప్లాన్ ధరలను భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జియో బాటలోనే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ లు కూడా టారిఫ్ ధరలను పెంచేశాయి. ఈ క్రమంలో కొందరు వేరే నెట్‌వర్క్‌కి కూడా మారారు.
చైనా కంపెనీలకి ధీటుగా..
అయినప్పటికీ జియో ఇప్పుడు సరికొత్త రికార్డ్ సాధించింది. ఆ కంపెనీ సాధించిన సరికొత్త రికార్డ్‌తో చైనా కంపెనీలని సైతం వెనక్కి నెట్టింది. జియో వెల్లడించిన జూన్ త్రైమాసిక గణాంకాల ప్రకారం.. జియో డేటా వినియోగం మొత్తం 4400 కోట్ల జీబీ దాటింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 33 శాతం ఎక్కువ. ఈ గణాంకాల ప్రకారం.. యూజర్లు ప్రతి రోజూ ఒక జీబీ కంటే ఎక్కువ డేటాను వినియోగిస్తున్నారు. ఇక 5జీ డేటా ఉపయోగించే వినియోగదారుల సంఖ్య 13 కోట్లకు చేరిందని జియో వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. 4జీ ప్లాన్ రీఛార్జ్ తో అర్హత కలిగిన వినియోగదారులు 5జీ డేటాను వినియోగించుకుంటున్నారు. దీన్ని బట్టి 5జీ డేటా వాడుకునేవారి శాఖ సంఖ్య బాగా పెరిగిందని తెలుస్తోంది.
Jio : చైనా కంపెనీలనే బీట్ చేసిన జియా.. ప్రముఖ టెలికాం సంస్థలో సరికొత్త రికార్డ్..!
ప్రస్తుతం జియోకి 49 కోట్ల కంటే ఎక్కువ వినియోగదారులు ఉన్నారని సమాచారం. జియో డేటా వినియోగించుకునే యూజర్ల సంఖ్య మాత్రమే కాదు.. ఫిక్స్డ్ వైర్లెస్ ఇంటర్నెట్ ని వినియోగించుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాల ప్రకారం 10 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లు జియో ఎయిర్ ఫైబర్ సేవలను వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. జూన్ త్రైమాసికంలో వాయిస్ కాలింగ్ విషయంలో కంపెనీ 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఇప్పుడు రికార్డు స్థాయి 1.42 ట్రిలియన్ నిమిషాలకు చేరుకుంది. మొత్తానికి జియో సాధించిన ఈ రికార్డ్ వెనక కస్టమర్ల కృషి ఉందని అర్ధమవుతుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.