Jio : జియో సరికొత్త ఆఫర్స్.. ఈ మూడు ప్రత్యేక ఆఫర్స్ గురించి తెలుసుకోవల్సిందే..!
ప్రధానాంశాలు:
Jio : జియో సరికొత్త ఆఫర్స్.. ఈ మూడు ప్రత్యేక ఆఫర్స్ గురించి తెలుసుకోవల్సిందే..!
Jio : రిలయన్స్ జియో వినియోగదారులని అట్రాక్ట్ చేసే ప్లాన్స్ వేస్తుంది. కొత్త కొత్త ప్లాన్స్‌ని ప్రవేశపెడుతూ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. డేటా మరియు కాలింగ్ విషయంలో అదనపు ప్రయోజనాలు దక్కేలా జియో కొత్త ఆఫర్స్ తీసుకొస్తుంది. సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 20, 2024 వరకు జరగనున్న జియో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ₹899, ₹999 మరియు ₹3,599 ధర కలిగిన ఈ మూడు ప్లాన్‌లు ప్రకటించారు. ముందుగా రూ. 899 ప్లాన్ చూస్తే ఇందులో రోజువారీ డేటా: రోజుకు 2GB, చెల్లుబాటు: 90 రోజులు, అదనపు ప్రయోజనాలు: 10GB డేటా వోచర్, 10 OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ మరియు Zomato గోల్డ్ మెంబర్‌షిప్ ఉంటుంది.
Jio పోటా పోటీగా..
రూ.999 పథకం చూస్తే.. ఇందులో రోజువారీ డేటా: రోజుకు 2GB, చెల్లుబాటు: 98 రోజులు, అదనపు ప్రయోజనాలు: 10GB డేటా వోచర్ మరియు OTT ప్లాట్‌ఫారమ్‌కు సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ₹899 ప్లాన్ లాగానే ఉంటుంది. ఇక రూ. 3,599 వార్షిక ప్రణాళిక చూస్తే.. రోజువారీ డేటా: రోజుకు 2.5GB, చెల్లుబాటు: 365 రోజులు,అదనపు ప్రయోజనాలు: అదే ఫీచర్లు, కానీ ఎక్కువ కాలం పాటు, ఎక్కువ మంది డేటా వినియోగదారులకు పొడిగించిన కవరేజీని అందిస్తుంది.ఈ మూడు ప్లాన్స్‌కి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. మూడు ప్లాన్‌లు 28 రోజుల పాటు ₹175 విలువైన 10 ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి. దీనితో పాటు, వినియోగదారులు పండుగ సీజన్‌లో ప్రీమియం కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.
జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ సబ్‌స్క్రైబర్‌లు చూస్తే దీని ద్వారా ఇది ప్రముఖ రెస్టారెంట్‌లలో ప్రత్యేకమైన డిస్కౌంట్‌లు మరియు ఆఫర్‌లను అందిస్తుంది. AJIO వొచర్ కోసం ₹500 వోచర్‌ను కూడా పొందుతారు, ₹2,999 కంటే ఎక్కువ ఆర్డర్‌లపై రీడీమ్ చేసుకోవచ్చు. వీటికి పోటీగా ఎయిర్‌టెల్ సెప్టెంబర్ 6 నుండి సెప్టెంబర్ 11, 2024 వరకు మూడు ప్రత్యేక పండుగ ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది.
ఈ ప్లాన్‌ల ధర ₹979, ₹1,029 మరియు ₹3,599. రూ. 979 ప్లాన్ చూస్తే.. రోజువారీ డేటా: రోజుకు 2GB,చెల్లుబాటు: 84 రోజులు,అదనపు ప్రయోజనాలు: అపరిమిత కాల్‌లు, 22+ OTT సేవలకు యాక్సెస్ మరియు 28 రోజుల పాటు 10GB డేటా కూపన్. మరో ప్యాకేజ్ చూస్తే.. రూ 1,029 ఇందులో రోజువారీ డేటా: రోజుకు 2GB, చెల్లుబాటు: 84 రోజులు, అదనపు ప్రయోజనాలు: అపరిమిత కాల్‌లు, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మరియు ఇతర OTT ప్రయోజనాలు. రూ. 3,599 వార్షిక ప్రణాళిక చూస్తే.. రోజువారీ డేటా: రోజుకు 2GB, చెల్లుబాటు: 365 రోజులు
అదనపు ప్రయోజనాలు: OTT సేవలు మరియు అపరిమిత కాలింగ్ ఉంటుంది.