RBI : ఆర్బీఐ సంచలన ప్రకటన .. డెబిట్, క్రెడిట్ కార్డులు వాడే వారు తప్పక చదవాల్సిన న్యూస్ ..!
RBI : తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన ప్రకటన చేసింది. క్రెడిట్ , డెబిట్ కార్డ్ లు వాడేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ , ప్రైవేటు రంగ సంస్థలకు ఆర్బిఐ ఎప్పటికప్పుడు కొత్త మార్పులు తీసుకొస్తూ ఉంటుంది. అటు బ్యాంకులకు ఇటు ఖాతాదారులకు మంచి జరిగేలా ఆర్దిక క్రమబద్ధీకరణ చేస్తూ ఉంటుంది. ఆర్బీఐ తీసుకొచ్చిన నియమాలు ఖాతాదారుల సేవలకు సులభతరం చేసేందుకు కృషి చేస్తాయి. ఈ క్రమంలోనే మరోసారి ఖాతాదారులను ఆకర్షించేందుకు ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఆర్బిఐ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ వాడే వారికి లాభం చేకూర్చేలా ఉంది. బ్యాంకులు లేదా ఇతర డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేసే ఆర్థిక సంస్థలు, వాటి కార్డుల్ని ఒకటి కంటే ఎక్కువ నెట్‌వర్క్స్‌పై జారీ చేయాల్సి ఉంటుంది. అంటే కస్టమర్లకు ఇకపై మల్టిపుల్ కార్డ్ నెట్‌వర్క్స్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. కస్టమర్లు వారికి కావలసిన నెట్‌వర్క్స్ కు మారేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ అందుబాటులో లేదు. తర్వాత కాలంలో ఏ సమయంలోనైనా ఇతర కార్డు నెట్‌ర్క్స్‌కైనా మారేందుకు అవకాశం ఉంటుంది.
దీనితోపాటు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కార్డులను జారీ చేసేటప్పుడు కార్డ్ నెట్‌వర్క్స్ సంస్థలతో ఎలాంటి అగ్రిమెంట్స్ చేసుకోకూడదు. వేరే నెట్‌వర్క్ నుంచి సేవలు పొందకుండా అడ్డుకోరాదు. కార్డులు పంపిణీ చేసే సంస్థలు, ఇతర నెట్‌వర్క్ సంస్థలు కచ్చితంగా ఆర్బీఐ కొత్త రూల్స్ అనుసరించాల్సిందే. ఈ సూచనలకు సంబంధించి డ్రాఫ్ట్ సర్క్యూలర్ ఆర్బీఐ ఇష్యూ చేసింది. దీనిపై ఆగస్టు 4 వరకు ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది. ఖాతాదారుల అభిప్రాయాల మేరకు అమలుపరచనుంది. ఆగస్టు 4 తర్వాత ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.