Earthquakes Phone : ఈ ఫోన్ మీ దగ్గర ఉండే భూకంపాల నుండి బయటపడొచ్చు..!
ప్రధానాంశాలు:
Earthquakes Phone : ఈ ఫోన్ మీ దగ్గర ఉండే భూకంపాల నుండి బయటపడొచ్చు..!
Earthquakes Phone : తాజాగా మయన్మార్, థాయ్‌లాండ్, చైనా, వియత్నాం వంటి తూర్పు ఆసియా దేశాల్లో సంభవించిన భూకంపాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా మయన్మార్ రాజధాని నేపిడాలో 1000 బెడ్స్ కలిగిన ఆసుపత్రి భూకంపం తీవ్రతకు నేలకూలింది. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కూడా కొన్ని భవనాలు కూలిపోయాయి. భూకంపాల కారణంగా మయన్మార్‌లో 181 మంది, థాయ్‌లాండ్‌లో 5 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ విధమైన ప్రకృతి వైపరిత్యాల సమయంలో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించడం చాలా కీలకం.

Earthquakes Phone : ఈ ఫోన్ మీ దగ్గర ఉండే భూకంపాల నుండి బయటపడొచ్చు..!
Earthquakes Phone భూకంపాలను ముందే కనిపెట్టే ఫీచర్ ఫోన్ ఇదే..
టెక్నాలజీ అభివృద్ధితో భూకంపాలను ముందుగా గుర్తించి అప్రమత్తం చేసే ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్ తన ఆండ్రాయిడ్ 15 OS లో Earthquake Detector ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం భారతదేశంతో పాటు అనేక దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. భూమి కంపిస్తే, భూకంప తీవ్రత అధికంగా ఉంటే, ఈ ఫీచర్ రియల్ టైమ్‌లో అలెర్ట్స్‌ను జారీ చేస్తుంది. అయితే తక్కువ తీవ్రత గల భూకంపాలను ఇది గుర్తించదు. గూగుల్ పిక్సల్, శాంసంగ్, వన్‌ప్లస్ వంటి బ్రాండ్లలో కొన్ని డివైజ్‌లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవడం చాలా సులభం. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Settings > Safety and Emergency > Earthquake Alerts ఆప్షన్‌ను ఎంచుకుని యాక్టివేట్ చేయాలి. భూకంపం సంభవించే సమయంలో భూకంప తరంగాల కంటే ఇంటర్నెట్ సిగ్నల్స్ వేగంగా ప్రయాణించి అలెర్ట్ పంపిస్తాయి. ఫలితంగా సమయానికి అప్రమత్తమై, సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. భూకంపాల సమాచారం వేగంగా అందుబాటులోకి రావడం ప్రజల ప్రాణాలను రక్షించడంలో ఎంతో సహాయపడుతుంది.