TNPSC Exam : వినూత్న ప్రయోగం.. పరీక్ష పత్రాల మూల్యాంకనంలో ఏఐ వినియోగం..!
TNPSC Exam : పరీక్షల్లో తెల్ల కాగితాన్ని నల్లగా చేస్తే చాటు, ఏదో ఒకటి రాస్తే మార్కులు వేసేస్తారనే విద్యార్థుల ధీమాకు ఇకపై చెక్ పడనుంది. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TNPSC) సమాధాన పత్రాలను వేగంగా మూల్యాంకనం చేయడానికి సరికొత్త సాంకేతికతను ప్రవేశపెడుతుందని ఆ రాష్ట్ర ఆర్థిక మరియు మానవ వనరుల నిర్వహణ మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ ప్రకటించారు. పరీక్షలు పేపర్ ఆధారిత మోడ్ నుండి కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్‌కి కూడా మారనున్నట్లు […]
ప్రధానాంశాలు:
TNPSC Exam : వినూత్న ప్రయోగం.. పరీక్ష పత్రాల మూల్యాంకనంలో ఏఐ వినియోగం..!
TNPSC Exam : పరీక్షల్లో తెల్ల కాగితాన్ని నల్లగా చేస్తే చాటు, ఏదో ఒకటి రాస్తే మార్కులు వేసేస్తారనే విద్యార్థుల ధీమాకు ఇకపై చెక్ పడనుంది. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TNPSC) సమాధాన పత్రాలను వేగంగా మూల్యాంకనం చేయడానికి సరికొత్త సాంకేతికతను ప్రవేశపెడుతుందని ఆ రాష్ట్ర ఆర్థిక మరియు మానవ వనరుల నిర్వహణ మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ ప్రకటించారు. పరీక్షలు పేపర్ ఆధారిత మోడ్ నుండి కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్‌కి కూడా మారనున్నట్లు ఆయన వెల్లడించారు.
TNPSC Exam AIతో మూల్యాంకన ప్రక్రియ
మూల్యాంకన ప్రక్రియలో మరింత పారదర్శకత మరియు సామర్థ్యాన్ని నిర్ధారించడానికి మరియు TNPSC ఫలితాలను త్వరగా ప్రచురించడానికి కృత్రిమ మేధస్సు (AI) ఉపయోగించబడుతుంది. ప్రతి సంవత్సరం వివిధ పోస్టుల కోసం TNPSC పరీక్షలకు సుమారు 40 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారు. ఈ అభ్యర్థుల మూల్యాంకన ప్రక్రియకు భారీ మౌలిక సదుపాయాలు మరియు మానవ వనరులు అవసరం కాబట్టి ఫలితాలు ఆలస్యమవుతున్నాయి.
సమాధానాలను దిద్దేందుకు స్కాన్ చేసిన కాపీని ఏఐకి అనుసంధానిస్తున్నారు. ఆ కాపీని ఏఐ పరిశీలించి తప్పుడు, తిరగరాసిన విషయాల్ని పట్టేస్తుంది. వెంటనే సంబంధిత ప్రొఫెసర్‌ను అలర్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి మూల్యాంకనంలో ఏఐకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వట్లేదు. ప్రొఫెసర్లకు సహాయంగా ఉండే ఒక టూల్‌గానే వాడనున్నారు. భవిష్యత్‌లో దీని సామర్థ్యాన్ని క్రమంగా పెంచి మూల్యాంకనంలో కీలకంగా ఉపయోగించాలనేది తమ లక్ష్యం అని ఆ రాష్ట్ర ప్రణాళికా కమిషన్ కార్యదర్శి ఎస్.సుధ వెల్లడించారు.
ఏఐతో మూల్యాంకన ప్రయోగాల కోసం 4 యూనివర్సిటీలను ఎంపిక చేశారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. సమాధాన పత్రాల్ని ఆయా వర్సిటీల్లో బోధకులే మూల్యాంకనం చేస్తున్నారు. దానికి ముందు అవే సమాధాన పత్రాల్ని ఏఐతోనూ మూల్యాంకనం చేయిస్తున్నారు. రెండు విధానాల్లో మూల్యాంకనం తీరును, మార్కులు వేయడంలో వైరుధ్యాలు, ఏఐ పనితీరును ప్రొఫెసర్లు, అధికారులు గమనిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. వచ్చిన ఫలితాలకు అనుగుణంగా ప్రశ్నపత్రాల్ని అనుసంధానించటంతో పాటు విషయ పరిజ్ఞానానికి సంబంధించిన నియమ నిబంధనలను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలపై నివేదికలను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు.