UPI : దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం .. వినియోగదారుల తిప్పలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

UPI : దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం .. వినియోగదారుల తిప్పలు

 Authored By ramu | The Telugu News | Updated on :27 March 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  UPI : దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం .. వినియోగదారుల తిప్పలు

UPI  : గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా UPI సేవలు అంతరాయం ఎదుర్కోవడంతో లక్షలాది మంది వినియోగదారులు చిల్లర లావాదేవీలు, ఆన్‌లైన్ పేమెంట్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డౌన్‌డిటెక్టర్ నివేదిక ప్రకారం.. నిన్న రాత్రి 7:50 గంటల వరకు 2,750 ఫిర్యాదులు నమోదయ్యాయి. అందులో గూగుల్ పే, పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యాప్ వినియోగదారులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ముఖ్యంగా SBI కస్టమర్లు ఆన్‌లైన్ బ్యాంకింగ్, మనీ ట్రాన్స్‌ఫర్ సమస్యలను భారీ స్థాయిలో ఎదుర్కొన్నారు. అయితే, ఈ సమస్య తాత్కాలికమని, దాన్ని NPCI (National Payments Corporation of India) పరిష్కరించిందని అధికారిక ప్రకటన వచ్చింది.

UPI దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం వినియోగదారుల తిప్పలు

UPI : దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం .. వినియోగదారుల తిప్పలు

NPCI దేశవ్యాప్తంగా UPI సేవలను అభివృద్ధి చేసి నిర్వహించే ప్రధాన సంస్థగా వ్యవహరిస్తోంది. ఈ సమస్యను NPCI అంగీకరిస్తూ… “టెక్నికల్ లోపం వల్ల UPI సేవలు నిలిచిపోయాయి, కానీ ఇప్పుడు సమస్య పూర్తిగా పరిష్కారమైంది” అని వెల్లడించింది. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి NPCI క్షమాపణలు కోరింది. ఇటీవల కాలంలో UPI వినియోగం విపరీతంగా పెరుగుతున్నందున, ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని NPCI పేర్కొంది. జనవరి 2024లో UPI ద్వారా 16.99 బిలియన్ ట్రాన్సక్షన్లు జరగడం, భారతదేశ డిజిటల్ పేమెంట్ విప్లవాన్ని సూచిస్తోంది.

UPI సేవల్లో అంతరాయం ఏర్పడినప్పుడు వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా పేమెంట్ హిస్టరీ చెక్ చేసి, డబ్బు అకౌంట్‌ నుండి కట్ అయ్యి ఉంటే 48 గంటల వరకు వేచి చూడాలి. చాలా సందర్భాల్లో పేమెంట్ ఫెయిల్ అయినా డబ్బు స్వయంగా తిరిగి క్రెడిట్ అవుతుంది. 48 గంటల్లో డబ్బు తిరిగి రాకపోతే మీ బ్యాంక్ పాస్‌బుక్ అప్‌డేట్ చేసి, బ్యాంక్ అధికారులను సంప్రదించడం ఉత్తమం. భారతదేశంలో 80% ఆన్‌లైన్ లావాదేవీలు UPI ద్వారానే జరుగుతున్నందున, ఇలాంటి సమస్యలు వినియోగదారులకు తీవ్ర అసౌకర్యం కలిగించేవే. NPCI, RBI సంయుక్తంగా UPI సేవల స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేయాలని వినియోగదారులు ఆశిస్తున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది