UPI : ఏప్రిల్ 1 నుండి ఆ మొబైల్ నెంబ‌ర్స్‌లో ఈ యాప్స్ ప‌ని చేయ‌వు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

UPI : ఏప్రిల్ 1 నుండి ఆ మొబైల్ నెంబ‌ర్స్‌లో ఈ యాప్స్ ప‌ని చేయ‌వు..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 March 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  UPI : ఏప్రిల్ 1 నుండి ఆ మొబైల్ నెంబ‌ర్స్‌లో ఈ యాప్స్ ప‌ని చేయ‌వు..!

UPI  : ఈ రోజుల్లో Google Pay, PhonePe లేదా Paytm వాడ‌ని వారు లేరు. అయితే ఏప్రిల్ 1, 2025 నుంచి, కొన్ని మొబైల్ నంబర్లలో ఈ యాప్‌లు పనిచేయకపోవచ్చు. ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తాజా మార్గదర్శకాలు, భద్రతా కారణాల వల్ల ఈ మార్పులు అమలులోకి వస్తున్నాయి.

UPI ఏప్రిల్ 1 నుండి ఆ మొబైల్ నెంబ‌ర్స్‌లో ఈ యాప్స్ ప‌ని చేయ‌వు

UPI : ఏప్రిల్ 1 నుండి ఆ మొబైల్ నెంబ‌ర్స్‌లో ఈ యాప్స్ ప‌ని చేయ‌వు..!

UPI  ఇది గుర్తు పెట్టుకోండి..

ఏప్రిల్ 1 నుంచి బ్యాంక్ ఖాతాకు లింక్ చేయని లేదా మార్చబడిన మొబైల్ నంబర్లతో యూపీఐ సేవలు పనిచేయడం ఆగిపోతుంది.యూపీఐ సేవలను మీరు కొనసాగించాలనుకుంటే మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబర్ పనిచేస్తుందో లేదో చూసుకోండి. మీ టెలికాం కంపెనీకి కాల్ చేసి, మీ నంబర్ స్టేటస్ తెలుసుకోండి. చాలా కాలంగా రీఛార్జ్ చేయకుండా లేదా వాడకుండా ఉంటే వెంటనే రీఛార్జ్ చేసి వాడుకలోకి తీసుకురండి.

లేదా మీ బ్యాంక్ ఖాతాలో కొత్త మొబైల్ నంబర్ లింక్ చేయండి. దీని ద్వారా సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి అవకాశం లభిస్తుంది. పనిచేయని మొబైల్ నంబర్ల రికార్డులను వారానికి ఒకసారి చెక్ చేయమని బ్యాంకులకు, యూపీఐ యాప్‌లకు ఇప్పటికే NPCI ఆర్డర్ వేసింది. దీనివల్ల వాడుకలో ఉన్న నంబర్లు మాత్రమే బ్యాంక్ ఖాతాలకు లింక్ అయి ఉంటాయి. దీనివల్ల సైబర్ నేరాలు, టెక్నికల్ సమస్యలు తగ్గుతాయని అధికారులు అనుకుంటున్నారు.ఇలా చేస్తే, ఏవైనా సమస్యలు లేకుండా మీ లావాదేవీలు నిరంతరాయంగా సాగుతాయి!

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది