CM Revanth Reddy : డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..?
ప్రధానాంశాలు:
ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రమాద బీమా
డెలివరీ బాయ్స్ కి కూడా ప్రమాద బీమా
డిసెంబర్ 28 నుంచి దరఖాస్తు
CM Revanth Reddy : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరి 20 రోజులు అవుతోంది. అప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా తీసుకోని నిర్ణయాలను తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి శెభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పటికే అభయ హస్తం స్కీమ్ పై తొలి సంతకం పెట్టి దానిలో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నారు. దాని వల్ల ఆటో, క్యాబ్ లకు గిరాకీ తగ్గుతుందని ఆటో, క్యాబ్ డ్రైవర్స్ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
దీంతో రాష్ట్రంలో ఉన్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు, ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ బాయ్స్ కు తెలంగాణ ప్రభుత్వం క్రిస్ మస్ కానుకను అందిస్తోంది. ఆటో డ్రైవర్లుగా పని చేసేవాళ్లకు, ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్స్ అందరికీ ఉచితంగా 5 లక్షల ప్రమాద బీమాను అందించనున్నారు. అలాగే రూ.10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్ మెంట్ ను అందించనున్నారు. అంటే.. డ్రైవర్ రంగంలో ఉన్న కార్మికులకు ఇది ఉచిత బీమా అన్నమాట. రైతులకు గత ప్రభుత్వం రైతు బీమాను ప్రటించినట్టుగా డ్రైవర్ రంగంలో ఉన్న కార్మికులందరికీ ఈ బీమా సౌకర్యం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ స్కీమ్ ను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు బీమా కోసం క్యాబ్, ఆటో డ్రైవర్లు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
CM Revanth Reddy : టీ హబ్ నుంచి క్యాబ్ డ్రైవర్ల కోసం ఒక యాప్
అయితే.. క్యాబ్ డ్రైవర్ల కోసం ఒలా, ఉబెర్ లా ప్రభుత్వం నుంచి టీహబ్ ద్వారా ఒక యాప్ ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచే క్యాబ్ డ్రైవర్ల కోసం ఈ యాప్ ను తీసుకొచ్చి వాళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.