Women : మహిళలకి ఉపయోగపడే కొత్త పథకం… దీని ద్వారా ఒక్కో మహిళకి రూ.5 లక్షలు
ప్రధానాంశాలు:
Women : మహిళలకి ఉపయోగపడే కొత్త పథకం... దీని ద్వారా ఒక్కో మహిళకి రూ.5 లక్షలు
Women : తెలంగాణలో గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకం చేశారు.తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు బీమా సౌకర్యం, రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ లాంటి పథకాలు ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన ఒక్కో మహిళలకు రూ.2500 వారి ఖాతాల్లో జమ చేసేందుకు సిద్దమవుతుంది. మహిళా సాధికారత మరియు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ప్రగతిశీల దశగా తెలంగాణ ప్రభుత్వం స్త్రీ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది .
Women ఆలస్యం ఎందుకు..
మహిళా నిధి అని కూడా పిలువబడే తెలంగాణ స్త్రీ నిధి , ఆర్థిక స్వాతంత్య్రాన్ని పెంపొందించడానికి, పేదరికాన్ని తగ్గించడానికి మరియు మహిళలకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారికి స్థిరమైన జీవనోపాధిని పెంపొందించడానికి రూపొందించబడింది. ఈ పథకం ద్వారా మహిళలు ఆయా యూనిట్లు నిర్వహించేందుకు గాను బ్యాంకులు, స్త్రీ నిధి, మండల మహిళా సమాఖ్య ద్వారా రుణం పొందే సదుపాయం కల్పించనున్నారు. స్త్రీ నిధి కింద రుణం కోసం దరఖాస్తు చేయడానికి, ఒక మహిళ తప్పనిసరిగా మండల్ మహిళా సమాఖ్యలు కింద రిజిస్టర్ చేయబడిన ఎస్‌హెచ్ జీలో భాగమై ఉండాలి మరియు కనీసం ఆరు నెలల పాటు క్రియాశీల సభ్యునిగా ఉండాలి. ఎస్‌హెచ్‌జీ సభ్యులపై ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయపడటానికి, సాంప్రదాయ ఆర్థిక సంస్థలు వసూలు చేసే వాటి కంటే తక్కువ పోటీ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తుంది .
ఈ పథకం ద్వార తెలంగాణలో ప్రతి మహిళలకు 5 లక్షలు అందేతంది.అప్లై చేసుకున్న 48 గంటల్లోనే రుణం మంజూరు అవుతోంది. దీని వల్ల మహిళలకు ఆర్థికంగా భరోసా లభిస్తోంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహయక సంఘాలకి ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని, ఈ ఏడాది రూ.20వేల కోట్లు మంజూరు చేస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. స్త్రీ నిధి గ్రామీణ మహిళలకు కొలేటరల్ లేదా గ్యారెంటర్‌ల అవసరం లేకుండా సులభంగా క్రెడిట్ యాక్సెస్‌ను అందిస్తుంది, తద్వారా వారు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి వీలు కల్పిస్తుంది. . అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరియు వారి ఆర్థిక స్వాతంత్ర్యం మరియు కమ్యూనిటీ స్థితిని పెంచుకోవడానికి స్త్రీ నిధి రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు.