Barrelakka Sirisha : ఆయనంటే నాకు చాలా ఇష్టం .. ఆయనే నా లవర్.. బర్రెలక్క..!

Authored By Anusha V | The Telugu News | Published on: December 2, 2023, 12:00 pm
  •  Barrelakka Sirisha : ఆయనంటే నాకు చాలా ఇష్టం .. ఆయనే నా లవర్.. బర్రెలక్క..!

Barrelakka Sirisha : తెలంగాణలో బర్రెలక్క పేరు తెలియని వారు ఉండరు. ఒక్క వీడియోతో జనాలలోకి వచ్చిన బర్రెలక్క ఏకంగా కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి బరిలోకి దిగి సెన్సేషన్ అయ్యారు. నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు తను రాజకీయాలలోకి వచ్చినట్లు ఆమె ఇది వరకే తెలిపారు. అయితే నిన్న జరిగిన ఎలక్షన్స్ లో బర్రెలక్క కు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలియదు కానీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆమె గెలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. బర్రెలక్క గెలిచిన ఓడిన జనాలలో మార్పు తీసుకొచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క డిసెంబర్ 3న గెలుస్తుందో లేదో చూడాలి.

ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బర్రెలక్క కు సంబంధించిన తాజా న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఆమె తను ప్రేమించిన లవర్ పేరు ఓపెన్ గా చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బర్రెలక్క మాట్లాడుతూ.. హీరో మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనే నా లవర్ అని, డిపార్ట్మెంట్ డ్రెస్సులో మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టమని, పోలీస్ అవ్వాలని ఆలోచన కూడా మహేష్ బాబు డిపార్ట్మెంట్ డ్రెస్ వల్లే వచ్చిందని చెప్పారు. అలాగే ఆయన సినిమాలన్నీ చూశానని, మహేష్ బాబు సినిమాలోని ఫేమస్ డైలాగులు చెబుతూ బర్రెలక్క ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

అలాగే సాయికుమార్ గారు సినిమాలన్నా, ఆయన డైలాగ్స్ అన్నా చాలా ఇష్టమని అన్నారు. ఇక బయట ఎవరిని ప్రేమించలేదని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయని, అందుకే అలాంటి వాటికి జోలికి పోలేదని బర్రెలక్క చెప్పుకొచ్చారు. ఇక తను పెళ్లి చేసుకోబోయే వాడు పెద్దగా చదువు కోకపోయిన, ఆస్తిపాస్తులు లేకపోయినా, నన్ను, మా అమ్మను వాళ్ళ అమ్మ లాగా బాగా చూసుకోవాలని, వాళ్ళ అమ్మకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మా అమ్మకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంతకు మించిన మంచి లక్షణాలు మరి ఏమి ఉండాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. అలాంటి భర్త వస్తే చేసుకుంటాను అని అన్నారు. మన స్తోమతకు తగ్గట్టు ఆశపడాలి , దాంతోనే కలలను సాకారం చేసుకోవాలి అని బర్రెలక్క చెప్పుకొచ్చారు.

Anusha V

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp