Hyderabad to Medak Double Line Highway: హైదరాబాద్ నుండి మెదక్ మధ్య డబుల్ లైన్ హైవే కంప్లీట్ చేసిన కేంద్ర ప్రభుత్వం..!!
Hyderabad to Medak Double Line Highway: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గట్కరి దేశవ్యాప్తంగా హైవేల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అనేక రాష్ట్రాలలో భారీ ఎత్తున హైవేలు నిర్మిస్తూ… నిధులు విడుదల చేస్తున్నారు. ఆ రాష్ట్రం ఏ రాష్ట్రం అనే తేడా లేకుండా ప్రతి రాష్ట్రంలో.. కొన్ని వేల కిలోమీటర్ల మేరకు హైవేలు నిర్మిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో హైదరాబాదు నుండి మెదక్ మధ్య డబుల్ లైన్ హైవే గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో మెదక్ నుంచి రుద్రూర్ వరకు కూడా హైవే నిర్మాణానికి కేంద్ర రవాణా శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. 89 కిలోమీటర్ల హైవే నిర్మాణం కోసం ₹899 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.
మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో దీనికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ కూడా అధికారులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈనెల ఆఖరిలో టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మరియు రోడ్డు ప్రమాదాలను నివారించటం అనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం హైవేల నిర్మాణం చేపడుతూ ఉంది.