CM Revanth Reddy : రేవంత్‌కు ముందుంది అసలు చాలెంజ్.. అప్పుల తెలంగాణలో సంక్షేమం సులువు కాదని తెలిసిపోయిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Revanth Reddy : రేవంత్‌కు ముందుంది అసలు చాలెంజ్.. అప్పుల తెలంగాణలో సంక్షేమం సులువు కాదని తెలిసిపోయిందా?

 Authored By kranthi | The Telugu News | Updated on :12 December 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  రేవంత్ కు కత్తి మీద సాములా తెలంగాణ పరిపాలన

  •  ఐదున్నర లక్షల కోట్ల అప్పును ఎలా తీర్చాలి?

  •  రేవంత్ ఏం చేయబోతున్నారు?

CM Revanth Reddy : అన్ని రాష్ట్రాలను పాలించడం వేరు.. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం వేరు. ఎందుకంటే.. తెలంగాణ నెత్తి మీద బోలెడు అప్పు ఉంది. ఆ అప్పును తీర్చాలంటే ఐదున్నర లక్షల కోట్లు కావాలి. కానీ.. ఆ అప్పును చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు. కానీ.. అప్పు మాత్రం వదిలేసి వెళ్లింది. అందుకే.. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని నడపడం అంత సులువు కాదని తెలిసిపోయింది. దీంతో అటు నుంచి కాకుండా ఇటు నుంచి నరుక్కురావడం స్టార్ట్ చేశారు రేవంత్ రెడ్డి. అందుకే.. వేల కోట్ల నిధులతో అమలు చేసే సంక్షేమ పథకాల కన్నా కూడా ఎలాంటి ఆర్థిక భారం లేని సంక్షేమ పథకాలను ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. అందులో భాగంగానే అభయ హస్తం స్కీమ్ కింద తొలి సంతకాన్ని పెట్టారు. అలాగే.. తన రెండో సంతకాన్ని రజనీ ఉద్యోగం కోసం చేశారు. అభయ హస్తం స్కీమ్ లో భాగంగా మహిళలు అందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

నిజానికి ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం అనేది పెద్దగా ఆర్థిక భారమేమీ కాదు. దాని కోసం ఇప్పటికప్పుడు వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిందేమీ లేదు. అందుకే.. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించారు. దీని వల్ల తెలంగాణలోని మహిళలంతా రేవంత్ కు ఫిదా అయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను ఒకేసారి అమలు చేయడం కుదరకపోవచ్చు. అందుకే.. తక్కువ ఖర్చుతో అమలు అయ్యే పథకాలను ప్రారంభించడం మొదలు పెట్టారు. ఆర్థిక భారం లేని మరో పథకం ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం. ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం వల్ల ప్రభుత్వం మీద ఇప్పటికిప్పుడు పడే భారం అయితే ఏం లేదు. అందుకే.. ఆరోగ్యశ్రీని ఆ తర్వాత అమలు చేశారు.

CM Revanth Reddy : రైతు బంధు నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు?

రైతు బంధు విషయంలోనూ రేవంత్ రెడ్డి తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఎన్నికలకు ముందే రైతు బంధు నిధులను అప్పటి ప్రభుత్వం అరేంజ్ చేసి రైతుల ఖాతాల్లో జమ చేయడానికి సన్నాహాలు చేసినా అప్పుడు ఎన్నికల కోడ్ ఉండటం వల్ల రైతు బంధు నిధులు విడుదల కాలేదు. ఆ నిధులు అలాగే ఉండటంతో ఇప్పుడు ఆ నిధులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఎకరానికి 15 వేల హామీని ఇప్పటికి వాయిదా వేసి.. సాధ్యాసాధ్యాలు అన్నీ తెలుసుకొని ఆ తర్వాత ఎకరానికి రూ.15 వేల హామీని అమలు చేస్తామని చెప్పారు. ముందైతే గత ప్రభుత్వం ఇస్తున్నట్టుగా సీజన్ కు రూ.5 వేలు ఎప్పటిలాగే విడుదల చేస్తామని చెప్పారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది