Rajiv yuva Vikasam : గుడ్‌న్యూస్‌.. నిరుద్యోగ యువతకు ఇక ఆ దిగులు లేదు.. రాజీవ్ యువ వికాసం మీకు వచ్చినట్లే !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajiv yuva Vikasam : గుడ్‌న్యూస్‌.. నిరుద్యోగ యువతకు ఇక ఆ దిగులు లేదు.. రాజీవ్ యువ వికాసం మీకు వచ్చినట్లే !!

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :14 May 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •   Rajiv Yuva Vikasam : గుడ్‌న్యూస్‌.. నిరుద్యోగ యువతకు ఇక ఆ దిగులు లేదు.. రాజీవ్ యువ వికాసం మీకు వచ్చినట్లే !!

Rajiv yuva Vikasam  : తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి యువత నుండి మంచి స్పందన వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 17న ఈ పథకాన్ని ప్రారంభించగా, ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులను స్వీకరించారు. మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుండగా, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు రుణాల మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది యువతకు రూ. 6 వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నారు.

Rajiv yuva Vikasam గుడ్‌న్యూస్‌ నిరుద్యోగ యువతకు ఇక ఆ దిగులు లేదు రాజీవ్ యువ వికాసం మీకు వచ్చినట్లే

Rajiv yuva Vikasam : గుడ్‌న్యూస్‌.. నిరుద్యోగ యువతకు ఇక ఆ దిగులు లేదు.. రాజీవ్ యువ వికాసం మీకు వచ్చినట్లే !!

రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం

అయితే ఎంపిక ప్రక్రియలో సిబిల్ స్కోర్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారన్న వార్తలు దరఖాస్తుదారుల్లో ఆందోళనకు గురిచేశాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క bhatti vikramarka mallu  కీలక ప్రకటన చేశారు. సిబిల్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. దీంతో వేల మంది దరఖాస్తుదారులు ఊరటచెందారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగుతోందని భట్టి విక్రమార్క తెలిపారు.

ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నిరుద్యోగ యువతకు రాయితీ రుణాలు అందనున్నారు. వారు రూ. 50,000 నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందే అవకాశం కలిగి ఉంటారు. పథకాన్ని నిష్పక్షపాతంగా, వేగంగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. జూన్ 2 నుంచి నియోజకవర్గాల వారీగా శాంక్షన్ లెటర్ల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణ యువతకు ఆర్థికంగా కొత్త దారులు తెరుచుకుంటాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది