KCR : సిట్టింగులకు ఫిట్టింగ్.. డేంజర్ జోన్ లో ఆ ఎమ్మెల్యేలు
KCR : సిట్టింగ్ లు అందరికీ టికెట్లు ఇచ్చేస్తా.. అని ఎప్పుడో సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ.. అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు కొంచెం అటూఇటూగా ఉంది. దీంతో సిట్టింగ్ లందరికీ టికెట్స్ ఇవ్వాలా.. వద్దా అనే మీమాంశలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు పుంజుకుంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కూడా వ్యతిరేకత పెరుగుతోంది. మూడోసారి అధికారంలోకి రావాలంటే కేసీఆర్ చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలి.
అందుకే.. సిట్టింగ్స్ అందరికీ టికెట్స్ ఇస్తే మొదటికే మోసం వస్తుందని కేసీఆర్ ముందే గుర్తించారు. పనితీరు బాగాలేనివారికి టికెట్స్ ఇచ్చేది లేదని ముందు నుంచే సంకేతాలు పంపిస్తున్నట్టు తెలుస్తోంది. మంచి రికార్డు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్స్ అని సూచనలు పంపించారట. ట్రాక్ రికార్డు సరిగ్గా లేనివాళ్లు తమ పద్ధతి మార్చుకోవాలని.. లేకపోతే.. కొందరు ఎమ్మెల్యేలకు టికెట్స్ డౌటే అన్నట్టుగా ఉంది పరిస్థితి.
KCR : ఎంతమందికి టికెట్స్ దక్కే చాన్స్ లేదు
సిట్టింగ్స్ అందరికీ టికెట్స్ ఇస్తాం.. కానీ.. ట్రాక్ రికార్డు సరిగ్గా లేని వాళ్లకు కష్టమే అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ హైకమాండ్ తీరు. మూడోసారి అధికారంలోకి రావాలంటే.. కొంచెం స్ట్రిక్ట్ గానే ఉండాలని భావిస్తున్నారట. మరోవైపు కొందరు ఆశావహులు కూడా టికెట్లను ఆశిస్తున్నారు. మరి.. ఇలాంటి సమయంలో పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇవ్వకూడదని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయానికి ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు తమ పద్ధతి మార్చుకోవాలని.. నెలలో కనీసం 21 రోజులు నియోజకవర్గంలోనే తిరగాలని ఎమ్మెల్యేలను ఆదేశాలు జారీ చేశారట. ఇంకా ఎన్నికలకు 6 నెలల వరకు సమయం ఉన్నందున రానున్న రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. అప్పటి వరకు ఎంత మంది సిట్టింగ్ లకు టికెట్స్ దక్కుతాయి అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.