CM KCR : చంద్రబాబుకు జగన్ ఉచ్చపోయిస్తున్నాడు.. జగన్ ను మెచ్చుకున్న సీఎం కేసీఆర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM KCR : చంద్రబాబుకు జగన్ ఉచ్చపోయిస్తున్నాడు.. జగన్ ను మెచ్చుకున్న సీఎం కేసీఆర్

 Authored By kranthi | The Telugu News | Updated on :22 October 2023,6:00 pm

CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ ను తెగ మెచ్చుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై తొలిసారి స్పందించిన సీఎం కేసీఆర్.. చంద్రబాబుకు సీఎం జగన్ ఉచ్చపోయిస్తున్నాడని చెప్పుకొచ్చారు. పాత ఏపీ అయినా.. ఇప్పటి తెలంగాణ, ఏపీ అయినా తెలుగు ప్రజానీకానికి గోదావరి, కృష్ణలో ఉన్న కేటాయింపు అందరికీ తెలిసిందే. 1480 టీఎంసీలు గోదావరిలో కేటాయింపులు ఉన్నాయి. తెలంగాణ, ఏపీకి కలిపి. అలాగే.. 811 టీఎంసీలు కృష్ణకు కేటాయింపులు ఉన్నాయి. రెండు కలిపినప్పుడు సుమారు 2300 టీఎంసీల నీళ్లు మనకు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల తర్వాత మిగిలింది బంగాళాఖాతమే కాబట్టి మిగులు జలాలు కూడా మీరే వాడుకోవచ్చని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది.

సుమారు 3000 టీఎంసీల పైచిలుకు నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. 4000 వరకు కూడా వెళ్తున్నాయి ఒక్కోసారి. కృష్ణలో శ్రీశైలం దగ్గర గేజ్ చూస్తాం. 1200 పైచిలుకు శ్రీశైలం నుంచి వస్తాయి. యావరేజ్ తీస్తే ఈ రకంగా యావరేజ్ ఉంది. సుమారుగా 4700 టీఎంసీల నీళ్లు రెండు రాష్ట్రాలు కలిపి వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు కయ్యం పెట్టుకొని తెలుగు ప్రజలు నష్టపోయారు. ఇప్పుడు అలా పని లేదు. కీచులాటలు అవసరం లేదు. కేంద్రం కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులం అదే మాట్లాడుకున్నాం. అందుకే రెండు రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న సుమారు 5000 టీఎంసీల నీళ్లను తెలంగాణ, ఏపీలో ప్రతి గ్రామానికి వెళ్లేలా చేయాలని నిర్ణయించాం. ఆ విధంగా మంచి పరిణామం జరుగుతోంది. రాష్ట్ర విభజన అంశాలు కావచ్చు.. ఇంకా ఏవేవో ఉన్నాయి. పరస్పరం అవసరాలు చాలా ఉంటాయి. శాంతి భద్రతల అవసరాలు కావచ్చు.. ఇరుగు పొరుగున ఉండేవాళ్లు ఖచ్చితంగా అవన్నీ సహకరించుకోవాలి అంటూ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

cm kcr great words about cm jagan

CM KCR : జగన్ బాగా పాలిస్తున్నారు

ఏపీలో తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్.. బాగానే పాలిస్తున్నాడు. ఏపీ సహకరిస్తేనే కృష్ణ, గోదావరి జలాల సమస్య పరిష్కారం అవుతుంది. రెండు రాష్ట్రాలకు కావాల్సిన నీళ్లు అందాలంటే రెండు రాష్ట్రాలు సహకరించుకోవాలి. లేకపోతే రెండు రాష్ట్రాలు నష్టపోవడమే కాదు.. ఆ నీళ్లన్నీ వృథాగా సముద్రంలో కలుస్తాయి అని సీఎం కేసీఆర్ అన్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది