
KCR
CM KCR : తెలంగాణలో బీజేపీ మెల్ల మెల్లగా చాప కింద నీరు మాదిరిగా పెరిగి పోతుంది. ఇలాంటి సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విఫలం అవుతున్నారు. పార్టీలో కొందరు మినహా ఎక్కువ శాతం మంది బీజేపీ పై విమర్శలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కొందరు భయంతో కూడా వ్యాఖ్యలు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా ఎక్కడ తమ అవినీతిని బయట పెట్టే విధంగా ఐటీ రైట్స్ ను చేస్తారేమో అనే భయంతో కొందరు నోరు మెదపడం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. పలువురు మంత్రులు ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేక మౌనంగా ఉంటున్నారు. పార్టీకి నష్టం జరుగుతున్నా నోరు విప్పని మంత్రులకు ఉద్వాసన పలికేందుకు గాను కేసీఆర్ సంచలన నిర్ణయానికి సిద్దం అవుతున్నారు.
కేసీఆర్ ప్రస్తుత క్యాబినేట్ నుండి అయిదు నుండి ఎనిమిది మందిని తొలగించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున జరుగబోతున్న ఈ మార్పుతో తెలంగాణ రాజకీయం పూర్తిగా మారబోతుందని అంటున్నారు. తెలంగాణలో బీజేపీ బలంను ఆదిలోనే తుంచి పారేసేందుకు కేసీఆర్ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే మంత్రి వర్గ కూర్పును ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులుగా ఉన్న వారు బీజేపీ పై వ్యాఖ్యలు చేయడం వల్ల మీడియాలో కవరేజ్ ఎక్కువగా వస్తుంది. తద్వారా బీజేపీ కి నష్టం తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకే బీజేపీని ఏకి పారేసే ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు.
KCR
కాంగ్రెస్ నుండి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు మరియు ప్రస్తుతం ఎమ్మెల్సీ బరిలో ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి కూడా కొత్త గా మంత్రి పదవులు చేపట్టబోతున్న వారిలో ఉన్నారు. ఇక తన కూతురు కవిత కు కూడా ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి కట్టబెట్టేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎమ్మెల్సీ ఫలితాల ఆధారంగా కూడా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. ఏ మంత్రి అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరిగా ప్రభావం చూపించలేక పోయారో వారు కూడా ఉద్వాసనకు గురి కాక తప్పదు అన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఏం జరుగుతుందో తెలియాలంటే మరో వారం పది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.