CM Revanth Reddy : హైదరాబాద్ నగర మహిళకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్
ప్రధానాంశాలు:
CM Revanth Reddy : హైదరాబాద్ నగర మహిళకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్
CM Revanth Reddy : హైదరాబాద్ Hyderabad నగరంలో మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మహిళా స్వయం సహాయక సంఘాలను, ఇప్పుడు నగరానికి విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు నగర శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో పెద్ద సంఖ్యలో కొత్త మహిళా సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

CM Revanth Reddy : హైదరాబాద్ నగర మహిళకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్
CM Revanth Reddy : ఇకపై హైదరాబాద్ మహిళలకు ఆ బాధలు లేనట్లే
ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశాన్ని వినియోగిస్తూ వేలాది మంది మహిళలు తమ జీవితాల్లో ఆర్థిక స్వావలంబన సాధించారు. కొన్ని సందర్భాల్లో వడ్డీ మొత్తాన్ని కూడా ప్రభుత్వం మాఫీ చేస్తూ, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వల్ల ఎదురయ్యే నష్టాలను నివారిస్తోంది. అయితే హైదరాబాద్ నగరంలో వీటి సంఖ్య తక్కువగా ఉండటంతో, ఈ ప్రాంతాల్లో కూడా మహిళలకు ఆర్థిక అవకాశాలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన సూచనలు ఇప్పటికే రంగారెడ్డి, మెడ్చల్, హైదరాబాద్ కలెక్టర్లకు అందాయి.
ఈ కొత్తగా ఏర్పడే సంఘాల ద్వారా మహిళలకు నైపుణ్యాలు పెంపొందించే శిక్షణలు, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. విద్యార్థుల యూనిఫామ్లు కుట్టడం, మహిళా శక్తి క్యాంటీన్లు నిర్వహించడం, ధాన్యం సేకరణ కేంద్రాల బాధ్యతలు వంటి పనులను ఈ సంఘాల ద్వారా చేపడతారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందిరా మహిళా శక్తి భవన్‌ను కేంద్రంగా చేసి, సభ్యులకు అవగాహన కల్పించనున్నారు. దివ్యాంగులు, వృద్ధులు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములవుతారని అధికారులు తెలిపారు.