మార్కెట్ లోకి కొత్త కల్తీ ముఠా.. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనే వారు జర జాగ్రత్త..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

మార్కెట్ లోకి కొత్త కల్తీ ముఠా.. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనే వారు జర జాగ్రత్త..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :12 July 2023,12:00 pm

ప్రస్తుత రోజుల్లో బయట మార్కెట్ చాలా కల్తీ అయిపోయింది. డబ్బులు సంపాదించడానికి మనిషి ఆరోగ్యంతో ఆడుకునే కంపెనీలు ఎక్కువైపోయాయి. మార్కెట్లో దొరికే చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్ వంటి తినుబండారాలు చాలా కల్తీ గా మారిపోయాయి. ఇంటికి తెచ్చుకునే సరుకులలో చాలా వరకు కల్తీ అయిపోయిన ఐటమ్స్ మార్కెట్ లో విక్రయాలు చేస్తున్నారు. నాణ్యత లేని ఆహార పదార్థాలు.. భారీ మొత్తంలో మార్కెట్ లో అమ్మేస్తున్నారు. నకిలీ అని తెలియకుండా చాలా తెలివిగా ప్యాక్ చేసి మరి తయారీదారులు మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. దీంతో వాటిని కొనుగోలు చేసిన వ్యక్తి అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఎక్కువ కనిపిస్తుంది.

హైదరాబాద్ వంటి అభివృద్ధి చెందిన నగరాలలో… చాలామంది సమయం లేకపోవడంతో దొరికిన ఆహార పదార్థాలు కొనేస్తున్నారు. స్వయంగా తయారు చేసుకోవడం వంటి వాటిని మహిళలు మానేయడం జరిగింది. దీన్నే ఆసరాగా చేసుకుని వ్యాపారస్తులు క్యాష్ చేసుకుంటున్నారు. వేగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పదార్థాలను మరింతగా కల్తీ సరుకును మార్కెట్లో అమ్మేస్తున్నారు. తాజాగా ఈ రకంగానే హైదరాబాదులో జావిద్ అనే వ్యాపారస్తుడు కల్తీ సరుకులు అమ్మేస్తూ ఉండగా అత్తాపూర్ పోలీసులు రైడ్స్ చేసి పట్టుకోవడం జరిగింది. ఏకంగా అల్లం లేకుండానే ఈ పేస్టు తయారు చేయటం కోసం మెరుపు. మేటర్ లోకి వెళ్తే మార్కెట్ లో పాడైపోయిన అల్లం… వెల్లుల్లిని పెద్ద మొత్తంలో జావేద్ కొనుగోలు చేసి వాటితో నాణ్యతలేని పేస్టు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

counterfeit ginger And garlic In market beware

counterfeit ginger And garlic In market beware

అల్లం ధర ఎక్కువగా ఉన్న సమయంలో ఎసిటిక్ యాసిడ్ మిక్స్ చేసి కోహినూరు బ్రాండ్ తో కల్తీ పేస్ట్ తయారు చేస్తున్నాడు. కుళ్ళిపోయిన దశలో ఉన్న వెల్లుల్లి బస్తాలను తీసుకువచ్చి యాసిడ్ కలిపి కొన్ని రసాయనాల ద్వారా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి… ఎలాంటి అనుమతులు లేకుండానే.. జావేద్ అమ్మేస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఇటువంటి కుళ్లిపోయిన ఆహార పదార్థాలతో కూడిన అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ తినడం ద్వారా ప్రాణాలు పోవడం గ్యారెంటీ అని… జాగ్రత్త వహించాలని పోలీసులు చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది