Geetha Karmikulu : వెంచర్ల అభివృద్ధి పేరిట గీత కార్మికుల పొట్ట కొట్టొద్దు
ప్రధానాంశాలు:
Geetha Karmikulu : వెంచర్ల అభివృద్ధి పేరిట గీత కార్మికుల పొట్ట కొట్టొద్దు
Geetha Karmikulu : వెంచర్ల అభివృద్ధి పేరిట తాటి చెట్లను కూల్చివేసి గీత కార్మికుల పొట్ట కొట్టొద్దని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు అన్నారు.పోచారం మున్సిపాలిటీ కొర్రెముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 311, 312, 313, 324,326 పి,327 పి లో దాదాపు 12 ఎకరాల్లో హెచ్ఎండిఎ లేఔట్ చేస్తున్న నిర్వహకులు కొర్రెముల గీత కార్మిక సంఘానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 85 తాటి చెట్లను తొలగించినందుకు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు.

Geetha Karmikulu : వెంచర్ల అభివృద్ధి పేరిట గీత కార్మికుల పొట్ట కొట్టొద్దు
Geetha Karmikulu : మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు
మంగళవారం దీక్షా శిబిరానికి మద్ధతుగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు హాజరై మాట్లాడుతూ… ఎక్సెజ్ శాఖ నుంచి అనుమతి తో పాటు జిల్లా కలెక్టర్ నుంచి ఎన్ఎసి తీసుకున్నప్పటికీ గీత కార్మిక సంఘం తీర్మానం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. తాటి చెట్లను తొలగించేందుకు ఒక్కో చెట్టుకు దాదాపు రూ.897 వందల చొప్పున 85 చెట్లకు సుమారు రూ. 80 వేలు సంఘానికి చెల్లించడం సరైన పద్ధతి కాదన్నారు.
తాతలనాటి నుండి 85 తాటి చెట్లను నమ్ముకొని 300 పైగా కుటుంబాలు జీవనం పొందుతున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, పల్లె బాబు రావు గౌడ్, దేశం బాలరాజ్ గౌడ్, కుర్ర విగ్నేశ్వర్ గౌడ్,అనిల్ గౌడ్, కట్ట దర్శన గౌడ్, భాస్కర్ గౌడ్, నగేష్ గౌడ్, వెంకట్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు