Ration Cards : రేషన్ కార్డు డెడ్ లైన్ ఇలా చేయకుంటే అంతే సంగతులు.!!
ప్రధానాంశాలు:
Ration Cards : రేషన్ కార్డు డెడ్ లైన్ ఇలా చేయకుంటే అంతే సంగతులు.!!
Ration Cards : రేషన్ కార్డు ఈ కేవైసీ ఇంకా చేసుకోలేదా.. అయితే వెంటనే మీ రేషన్ దుకాణం వద్దకు వెళ్లి మీరు రేషన్ కార్డు ని ఈ కేవైసీ చేసుకోండి..లేకపోతే మీకు ఇక రేషన్ సరుకులు రాక పోవచ్చు.. ఈ కేవైసీ డెడ్లైన్ ప్రక్రియ ప్రభుత్వం విధించింది. రేషన్ కార్డుల ఈ కేవైసీ కి జనవరి 31 గడువు అని స్పష్టం చేస్తుంది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ సోహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈలోపు ఎవరైనా ఆధార్ లింకు చేయని వారు ఉంటే వెంటనే ఆ పని పూర్తి చేయడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. బోగస్ రేషన్ కార్డులను తొలగించాలని ఉద్దేశంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ ఈ కేవైసీ కార్యక్రమాన్నీ చేపట్టింది.గత తొమ్మిదేళ్లలో ఎంతోమంది చనిపోగా.. మరికొందరు పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు…
ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పేరు ఈ కేవైసీ చేపట్టింది. ప్రస్తుతం రేషన్ కార్డులో పేరు ఉన్న వారు అంతా వేలిముద్రలు వేయాలని స్పష్టం చేస్తుంది. రెండు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రేషన్ దుకాణాలకు వెళ్లి ఈకేవైసి చేసుకుంటున్నారు. ఈ కేవైసీ కోసం వేలిముద్రలు ఆధార్ ధ్రువీకరణ వంటి గుర్తింపులు తీసుకుంటున్నారు. రేషన్ కార్డును ఆధార్ నెంబర్తో లింకు చేయడానికి మీ రేషన్ కార్డులు ఉన్నా సభ్యులందరి ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ కేవైసీను పూర్తి చేస్తారు..ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించారు. తాజాగా ఆ గడువును జనవరి 31 వరకు పొడిగించారు. తెలంగాణలో రేషన్ ఈ కేవైసీ ఇప్పటికే సుమారు 70% ప్రక్రియ పూర్తయింది. ఇంకా 30% మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలో ప్రజలకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి.
పలు రేషన్ షాప్ లో బయోమెట్రిక్ మిషన్ లో వృద్ధులు, చిన్నపిల్లల వేలిముద్రలు నమోదు కావడం లేదు. అలాంటి వారందరూ ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. కేంద్రాలు నమోదు చేసుకున్న రోజు నుంచి 90 రోజుల్లోపు అప్డేట్ అవుతున్నాయి. అయితే ప్రభుత్వం జనవరి 31 వరకే అవకాశం ఇవ్వడంతో ఇంకా అప్డేట్ చేసుకుని వారిలో ఆందోళన మొదలైంది. జనవరి 31 లోపు రేషన్ ఈ కేవైసీ చేయకపోతే రేషన్ కార్డును నకిలీగా భావించి డిలీట్ చేయనుంది. ప్రభుత్వం ఇలా డిలీట్ అయినట్లయితే ప్రభుత్వం డేటాలో మీ రేషన్ కార్డు వివరాలు తొలగిపోతాయి. దాంతో మీకు వచ్చే రేషన్ సరుకులు ఆగిపోనున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పథకాలతో రేషన్ కార్డు చాలా కీలకం. కాబట్టి వెంటనే ఇంకా ఈ కేవైసీ చేయని వాళ్ళు వెంటనే చేసుకోవడం మంచిది..