Gaddar Last Letter : బయటపడ్డ గద్దర్ రాసిన ఆఖరి లేఖ.. లెటర్ చదివి కుప్పకూలిన కొడుకు.. అందులో ఏముందంటే?
Gaddar Last Letter : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా గద్దర్ గురించే చర్చ. అవును.. గద్దర్ అంటే ఒక వ్యక్తి కాదు. ఆయనొక విప్లవ వీరుడు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. గద్దర్ లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఆయన చనిపోయి నేటికి మూడు రోజులు అయింది. ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ లోని అల్వాల్ లో నిర్వహించారు. అయితే.. తాజాగా ఆయన రాసిన చివరి లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన ఆసుపత్రి బెడ్ మీద ఉండి రాసిన ఆ లేఖను చదివి కన్నీళ్లు పెట్టుకోని వాళ్లు లేరు.అసలు ఆ లేఖలో ఏముంది.. ఎందుకు గద్దర్ తన చివరి లేఖను రాశారు.. అనేది తెలియాలంటే ఆ లేఖ చదవాల్సిందే.
ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో రాసిన లేఖపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అది ఒక బహిరంగ లేఖ. జులై 31న మీడియాకు విడుదల చేశారు. అందులో ఆయన తన ఆరోగ్య విషయాలు చెప్పారు. తాను చికిత్స తీసుకుంటున్నానని.. ఆరోగ్యం కుదుటపడుతోందని రాశారు. అయితే.. ఈ లేఖ రాసిన ఆరు రోజులకే ఆయన కన్నుమూశారు. గుమ్మడి విఠల్ నా పేరు. గద్దర్ నా పాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయసు 76 సంవత్సరాలు. నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా వయసు 20 సంవత్సరాలు. ఇటీవల నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా మా భూములు మాకే నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నాను.
Gaddar Last Letter : ఆ లెటర్ లో గద్దర్ ఏం రాశారంటే ?
నా పేరు జనం గుండె చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు కానీ.. ఎందుకో గుండెకు గాయం అయింది. ఈ గాయానికి చికిత్స కోసం అపోలో స్పెక్ట్రమ్ ఆసుపత్రిలో చేరాను. జులై 20 నుంచి నేటి వరకు అన్ని రకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుటపడుతున్నాను. గుండె చికిత్స నిపుణులు నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందుతోంది. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ దగ్గరికి వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి ప్రజలు రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాటిస్తున్నాను అంటూ ఆ లేఖలో రాశారు.