Gaddar Son : కాంగ్రెస్ పార్టీలోకి గద్దర్ కొడుకు సూర్య.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ.. గెలుపు పక్కా?
Gaddar Son : గత ఐదారు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. గద్దర్ మరణం గురించి. ఆయన మరణించలేదు. ఆయన పాటల ద్వారా తెలుగు సమాజంలో బతికే ఉన్నారు అని అందరూ ఆయన్ను స్మరించుకున్నారు. గద్దర్ అనేది ఒక పేరు కాదు. అదొక భరోసా, ఆదొక ఆశ, ఆదొక విప్లవం. గద్దర్ పాట పాడితే ఒంటి మీద రోమాలు నిక్కపొడుచుకోవాల్సిందే. ఆయన పాటలతో ప్రజల్లో విప్లవ భావాలను రేకెత్తించడంలో గద్దర్ దిట్ట. ఆయన ఇక లేరు అనే విషయాన్ని తెలుగు సమాజం జీర్ణించుకోలేకపోతోంది.
అణగారిన వర్గాల కోసం, వాళ్ల బాగు కోసం పాట రూపంలో ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆ ప్రజా గాయకుడు లేకపోయినా ఆయన పాటలు ఎన్ని తరాలు మారినా ఉంటాయి. నిజానికి.. గద్దర్ ఇటీవలే తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనే పార్టీని స్థాపించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా భావించారు. కానీ.. ఆ కోరిక తీరకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అందుకే.. తన తండ్రి కోరికను, ఆశయాన్ని నెరవేర్చేందుకు గద్దర్ కొడుకు సూర్య రాజకీయాల్లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది.గద్దర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు హైకమాండ్ కూడా సిద్ధంగానే ఉందని తెలుస్తోంది. ఇటీవల ఖమ్మం సభలో గద్దర్ తో రాహుల్ గాంధీ ఆప్యాయంగా మాట్లాడారు. రాహుల్ ను గద్దర్ ప్రేమగా ముద్దు పెట్టుకున్నారు.
Gaddar Son : గద్దర్ ను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ రెడీ
అందుకే.. గద్దర్ చనిపోయారని తెలిసి రాహుల్ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అందుకే గద్దర్ ఆశయాలను కొనసాగించేందుకు ఆయన కొడుకు సూర్యను పార్టీలో చేర్చుకొని ఏదైనా నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారట. సూర్యను ఎలాగైనా అసెంబ్లీకి పంపించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ.. ఏ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తారు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.