Indiramma House : గుడ్ న్యూస్.. డ్వాక్రా గ్రూప్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు పెట్టుబడి .. లబ్దిదారులకు ఇది గొప్ప వరం..!
ప్రధానాంశాలు:
మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యిందా..? అయినాగానీ మీరు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్
Indiramma House : గుడ్ న్యూస్.. డ్వాక్రా గ్రూప్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు పెట్టుబడి .. లబ్దిదారులకు ఇది గొప్ప వరం..!
Indiramma House : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం దశలవారీగా ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. పునాది పనులు పూర్తి చేసిన వారికి మొదటి విడతగా రూ.1 లక్ష మంజూరు చేస్తోంది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా కొంతమంది పునాది కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారికీ ప్రభుత్వం గొప్ప శుభవార్త తెలిపింది. డ్వాక్రా సంఘాల ద్వారా వీరికి రుణ సదుపాయం కల్పిస్తోంది.

Indiramma House : గుడ్ న్యూస్.. డ్వాక్రా గ్రూప్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు పెట్టుబడి .. లబ్దిదారులకు ఇది గొప్ప వరం..!
Indiramma House : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్
కనీసం రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు రుణం అందేలా చర్యలు తీసుకుంది. డ్వాక్రా సంఘాల్లో అప్పుల్లేని సభ్యులు తమ బ్యాంక్ లింకేజీ, కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (CIF), శ్రీనిధి లాంటి ప్రభుత్వ పథకాల ద్వారా ఈ రుణాలను పొందవచ్చు. ఇది వారికి పునాది నిర్మాణానికి అవసరమైన మొట్టమొదటి నిధిని సమకూర్చేందుకు ఉపయోగపడనుంది.
ఇప్పటికే రాష్ట్రంలోని కొంతమంది లబ్ధిదారులకు ఈ రుణాలు మంజూరయ్యాయి. ఈ చర్యల వల్ల గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోకుండా పూర్తవుతుంది. ప్రభుత్వ ఉత్తర్వులు, సంబంధిత అధికారులు సమన్వయంతో ఈ విధానం అమలులో ఉంది. ఇది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మరింత బలాన్నిచ్చేలా, గృహలక్ష్ములకు స్వగృహం కల నెరవేర్చేలా మారుతోంది.