Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు భలే చెక్ పెట్టేశాడుగా..!
ప్రధానాంశాలు:
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు భలే చెక్ పెట్టేశాడుగా..!
Harish Rao : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలోకి గల ముఖ్య కారణాలలో రుణమాఫీ కూడా ఒకటి. కాంగ్రెస్ పార్టీ నాయకులు తలాతోక లేకుండా రోజుకో తీరుగా మాట్లాడటం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు హరీశ్‌రావు విమర్శించారు. ముఖ్యమంత్రేమో రుణమాఫీ పూర్తి చేసినట్లు డబ్బా కొడితే, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం రుణమాఫీ పూర్తి కాలేదంటున్నరని అన్నారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను రేవంత్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రుణమాఫీ కాలేదని ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలిపిన రైతులను అరెస్టులు చేయడం హేయమైన చర్య అని చెప్పారు. పోలీసు యాక్ట్ పేరు చెప్పి, జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు హుకుం జారీ చేయడం హక్కులను కాలరాయడమేనని హరీష్‌రావు అన్నారు.
Harish Rao హరీష్ రావు ఫైర్..
ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఆగస్ట్ 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని తెలంగాణలోని అన్ని దేవుళ్ల మీద ఒట్టేసి చెప్పాడు. ఎన్నికల తర్వాత ఆ ఒత్తిడి పెరగడంతో వారికి చేయాలో అర్ధం కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ణమాఫీ ఒకేసారి చేయడం అసాధ్యం కావడంతో పాటు, మిగిలిన పథకాల అమలుకు సమస్యలు వస్తాయనే బీఆర్ఎస్ హయాంలో విడతల వారీగా చేశారు. అయితే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.41 వేల కోట్ల రుణమాఫీని రూ.31 వేల కోట్లకు కుదించి మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కాని రైతుభరోసా కింద రూ.15 వేల కోట్లను పక్కన పెట్టినా రుణమాఫీ సాధ్యం కాలేదు. మరోవైపు మూడు విడతల్లో రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసి రుణమాఫీ పూర్తయిందని సీఎం హోదాలో రేవంత్ ప్రకటించడంతో అందరిలో అనేక అనుమానాలు మొదలయ్యాయి.
అయితే మరో 12 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని, సాంకేతిక కారణాలు, రైతులను గుర్తించడంలో పొరపాట్ల మూలంగా సమస్య ఏర్పడిందని మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి సర్దిచెప్పడంతో బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. నమ్మి ఓటేసినందుకు రైతన్నను నట్టేట ముంచారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారింది. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు మరిచిపోయినట్లున్నారు. ఇప్పటికైనా కండ్లుతెరిచి రైతులందరికీ రుణమాఫీ చేయాలని, ఆందోళనలో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ సహా ఇతర జిల్లాల్లో రైతన్నలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే అరెస్టు చేసిన రైతన్నలకు అండగా బీఆర్ఎస్ పార్టీ కార్యచరణ ప్రకటిస్తుంది’’ అని ప్రభుత్వాన్ని మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు.