Harish Rao : రాజ‌కీయ మ‌నుగ‌డ‌కే హ‌రీశ్‌రావు అర్థంప‌ర్థం లేని విమ‌ర్శ‌లు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Harish Rao : రాజ‌కీయ మ‌నుగ‌డ‌కే హ‌రీశ్‌రావు అర్థంప‌ర్థం లేని విమ‌ర్శ‌లు..!

Harish Rao : తెలుగు మూవీ స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో హీరో ఓ స‌న్నివేశంలో చెప్పిన‌ట్లుగా బాగున్న‌ప్పుడు లెక్క‌లు మాట్లాడి, బాగోలేన‌ప్పుడు విలువ‌లు మాట్లాడ‌డం క‌రెక్ట్ కాదు అన్నచందంగా ఉందీ బీఆర్ఎస్ పార్టీ ప‌రిస్థితి అని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీ రామారావు (కేటీఆర్), టీ హరీశ్ రావులు తమ రాజకీయ మనుగడ కోసం ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఫార్వార్డ్‌లలో వేలాడుతూ అర్థంపర్థం లేని విమర్శలకు దిగుతున్నారని కాంగ్రెస్ నాయ‌కులు పేర్కొంటున్నారు. తమ తప్పులు, పర్యవసానాలకు ప్రజలు […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 October 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Harish Rao : రాజ‌కీయ మ‌నుగ‌డ‌కే హ‌రీశ్‌రావు అర్థంప‌ర్థం లేని విమ‌ర్శ‌లు..!

Harish Rao : తెలుగు మూవీ స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో హీరో ఓ స‌న్నివేశంలో చెప్పిన‌ట్లుగా బాగున్న‌ప్పుడు లెక్క‌లు మాట్లాడి, బాగోలేన‌ప్పుడు విలువ‌లు మాట్లాడ‌డం క‌రెక్ట్ కాదు అన్నచందంగా ఉందీ బీఆర్ఎస్ పార్టీ ప‌రిస్థితి అని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీ రామారావు (కేటీఆర్), టీ హరీశ్ రావులు తమ రాజకీయ మనుగడ కోసం ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఫార్వార్డ్‌లలో వేలాడుతూ అర్థంపర్థం లేని విమర్శలకు దిగుతున్నారని కాంగ్రెస్ నాయ‌కులు పేర్కొంటున్నారు. తమ తప్పులు, పర్యవసానాలకు ప్రజలు తమను ఎదిరిస్తారనే భయంతో బీఆర్ఎస్ నాయ‌కులు ప్రజలను కలవడానికి భయపడుతున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.

ఆ పార్టీకి చెందిన ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి హరీశ్‌రావు వైఖరి సైతం ఏమాత్రం తీసిపోకుండా ఉంది. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతున్నదా అనే చర్చ ప్రస్తుతం ప్రజల్లో కొనసాగుతుంది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు లేని విలువలు ఇప్పుడు ఆయనకు గుర్తుకు వస్తున్నాయా అని బ‌హిరంగంగా ప్రశ్నిస్తున్నారు. ఆ పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంద‌ని అప్పుడు ఒప్పు అయిన‌ది ఇప్పుడు తప్పు ఎలా అవుతుంద‌ని స‌ర్వ‌త్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క‌టే ఉండాల‌న్నంతంగా ఇత‌ర పార్టీల నుంచి వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించారు. కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలుపొందిన వారిని తమ పార్టీలో చేర్చుకున్నారు. కొంత మందికి పదవుల ఆశ జూపి చేర్చుకోగా.. మరికొందరిని బ్లాక్ మెయిల్ రాజకీయాలతో చేర్చుకున్నారని అప్పట్లో టాక్ ఉండేది. ట్రబుల్ షూటర్ నేతృత్వంలో ఫిరాయింపులను జోరుగా ప్రోత్స‌హించారు. దాంతో ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్లుగా వెలుగు వెలిగిన నేతలందరూ బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. కొందరు సలహాదారులు అయితే.. మరికొందరికి మంత్రి పదవులు లభించాయి.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే త‌న పార్టీనే కాంగ్రెస్‌లో విలీనం చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్ అనంత‌రం కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా రాజకీయాలు నడిపిన తీరు అంతా గ‌మ‌నించిందే. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను గులాబీ గూటికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లోనూ అవే పాలిటిక్స్ నడిపించారు.నీవు నేర్పిన విద్య‌యే నీరజాక్ష అన్నట్లుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనుస‌రించ‌డం ప్రారంభించ‌డంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుతుండడాన్ని ఆ పార్టీ తట్టుకోలేకపోతుంది. వారు పార్టీ నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి వారిపై ఫిరాయింపుల చట్టం ప్రయోగించాలని పోరుతూనే ఉంది. బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. హైకోర్టును ఆశ్రయించి వారిని అనర్హులుగా ప్రకటించాలని దావాలు వేశారు.

Harish Rao రాజ‌కీయ మ‌నుగ‌డ‌కే హ‌రీశ్‌రావు అర్థంప‌ర్థం లేని విమ‌ర్శ‌లు

Harish Rao : రాజ‌కీయ మ‌నుగ‌డ‌కే హ‌రీశ్‌రావు అర్థంప‌ర్థం లేని విమ‌ర్శ‌లు..!

తాజాగా హరీశ్‌రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ పార్టీనే ఫిరాయింపులను ప్రోత్సహించి.. ఇప్పుడు ఫిరాయింపులపై పోరాడడం ఏంటని ప్రజల్లో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించి ఇప్పుడు పోరాడడం ఏంట‌ని అంటున్నారు. సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి హరీశ్ ఎక్స్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. పోచారం ఎమ్మెల్యేగా తమ వెంబడి వచ్చాడని సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కాంగ్రెస్ నేత రవీందర్‌కు చెప్పారని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా పోచారమే బహిరంగంగా ప్రకటించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ టికెట్‌పై ఎన్నికైన ఆయన పార్టీ ఫిరాయించారనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించినందుకు వ్యవసాయ శాఖ అడ్వయిజరీ పదవా..? ఇదేనా రాహుల్ ప్రవచిస్తున్న రాజ్యాంగ రక్షణ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. హరీశ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనే నెటిజన్లు పెద్దఎత్తున ప్రశ్నిస్తున్నారు. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో చేసింది ఏంటని ఫైర్ అవుతున్నారు. ‘మీరు చేస్తే రైటు.. కాంగ్రెస్ చేస్తా రాంగా. సిగ్గుందా హరీశ్’ అంటూ నిలదీశారు. ఫిరాయింపులపై పోరాటాలు మాని ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించాలని హిత‌వు ప‌లికారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది