Harish Rao : సిద్దిపేట నుంచి హరీశ్ రావు ఔట్.. కేసీఆర్ అసలు ప్లాన్ ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు
Harish Rao : సిద్దిపేట అంటే హరీశ్ రావు.. హరీశ్ రావు అంటే సిద్దిపేట. అందులో నో డౌట్. చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అసలు సిద్దిపేట ఇంతలా అభివృద్ధి చెందిందంటే.. హైదరాబాద్ తర్వాత ఆ రేంజ్ లో డెవలప్ అయిందంటే దానికి కారణం హరీశ్ రావు. సిద్దిపేటను ఇంతలా డెవలప్ చేసిన సిద్దిపేట నుంచి ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఎంతమంది పోటీకి వచ్చినా గెలిచేది హరీశ్ రావు మాత్రమే. అది అందరికీ తెలిసిన విషయమే.
అలాంటిది.. సిద్దిపేట నుంచి హరీశ్ రావును పోటీ చేయకుండా ఆపాలనేది కేసీఆర్ ప్లానట. విచిత్రంగా ఉంది కదా. దానికి చాలా కారణాలు ఉన్నాయట. ఇదివరకు ఎన్నికలు వేరు. ఇప్పటి ఎన్నికలు వేరు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది. మూడోసారి ముచ్చటగా సీఎం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. అందుకే.. ఏ ఒక్క అవకాశాన్ని కూడా విడిచిపెట్టొద్దని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే సిద్దిపేట నుంచి హరీశ్ రావును తప్పించాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త ముఖానికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారట. అది ఒక్క సిద్దిపేటకే కాదు.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ అదే ప్లాన్ ను అమలు చేయాలని భావిస్తున్నారట. అన్ని నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారట.
Harish Rao : మరి హరీశ్ రావుకు ఏ నియోజకవర్గం టికెట్ ఇస్తారు?
హరీశ్ రావును సిద్దిపేట నుంచి తప్పించి.. హుస్నాబాద్ నియోజకవర్గానికి పంపించాలని కేసీఆర్ అనుకుంటున్నారట. సిద్దిపేట నుంచి తన అన్న కొడుకు వంశీని పోటీ చేయించాలని భావిస్తున్నారట. అందుకే.. హరీశ్ ను ఎక్కువగా హుస్నాబాద్ లో తిరిగేలా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్. హుస్నాబాద్ కూడా బీఆర్ఎస్ కు కంచుకోట కావడం, హుస్నాబాద్ హరీశ్ రావుకు దగ్గరి నియోజకవర్గమే కావడంతో తాను ఎలాగైనా గెలుస్తా అనే నమ్మకంతో హరీశ్ రావు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.