Hyderabad Public School : తల్లిదండ్రులకు శుభవార్త.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఉచిత విద్య.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!
ప్రధానాంశాలు:
Hyderabad Public School : తల్లిదండ్రులకు శుభవార్త.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఉచిత విద్య.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!
Hyderabad Public School : తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి అని అనుకుంటారు. తమకు ఉన్నంతలో పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటారు. ఇప్పటి కాలంలో నాణ్యమైన విద్య అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న స్కూల్లో ఎల్ కేజి లో జాయిన్ చేయించడానికి లక్షల ఖర్చు అవుతుంది. పేద,మధ్యతరగతి తల్లిదండ్రులకు అంత పెద్ద మొత్తం చెల్లించాలంటే తలకు మించిన భారంగా మారింది. ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్ మీడియం చదవకపోతే పిల్లల భవిష్యత్తు చాలా కష్టంగా మారుతుంది. అందుకే పిల్లల తల్లిదండ్రులు అప్పోసొప్పు చేసి ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివిస్తుంటారు. ఇప్పుడున్న కాలంలో డబ్బులు కట్టినా సరే నాణ్యమైన విద్యను అందించటం అనేది చాలా కష్టంగా మారింది. మన రాష్ట్రంలో నాణ్యమైన, ఉన్నతమైన విద్యను అందించడంలో కార్పొరేట్ స్కూల్ జాబితాలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముందు వరసలో ఉంటుంది.
కేవలం మన రాష్ట్రంలోనే కాకా సౌత్ ఇండియా స్కూల్లో టాప్ వన్ గా నిలిచింది. ఇక్కడ చదువు మాత్రమే కాక ఆటలు, క్రమశిక్షణతో కూడుకున్న ఎన్నో అంశాలను పిల్లలకు తీర్చిదిద్దుతారు. సీఎం వైఎస్ జగన్ తో సహా ఎంతో మంది ప్రముఖులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి మీ పిల్లలు కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో
చదివించాలనుకుంటున్నారా. అది కూడా ఫ్రీగా చదివించాలి అనుకుంటున్నారా. అయితే ఈ అవకాశం అందరికీ లేదు. కేవలం హనుమకొండలో గల విద్యార్థులకు మాత్రమే. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గిరిజన విద్యార్థి, విద్యార్థులకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. హనుమకొండ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ జిల్లాలో గల గిరిజన విద్యార్థులకు ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. ఆసక్తి గల పేద, నిరుపేద విద్యార్థులు గిరిజన అభివృద్ధి అధికారిక కార్యాలయం ఒకటో తరగతి దరఖాస్తులు చేసుకోవాలి అని తెలియజేశారు. ఈనెల మార్చి 11 వరకే ఆఖరి తేదీ అని వెల్లడించారు.
ఇక దీనికి గల అర్హతలు : విద్యార్థి తల్లిదండ్రుల ఆదాయం పట్టణంలో ఉండే వారికి అయితే రూ.2,00,000. గ్రామీణ ప్రాంతంలో ఉండే వారికి అయితే రూ.1,50,000 కు మించరాదు. దీనికి సంబంధించిన తహసిల్దార్ నుండి మీసేవ ద్వారా జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. నివాస ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. మున్సిపాలిటీ అధికారులు ఇవ్వబడిన బర్త్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థులు జూన్ 1, 2017 మే 31, 2018 లోపు జన్మించిన వారై ఉండాలి. దరఖాస్తు ఫామ్ తో పాటు మూడు పాస్ ఫోటోలు, కుల ధ్రువీకరణ పత్రాల కాపీలు అవి కూడా గెజిటెడ్ అధికారి చేత అటేస్టేషన్ చేసినవి జత చేయాలి. ఆ తర్వాత లక్కీ డ్రా ని నిర్వహిస్తారు. దరఖాస్తు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ లక్కీ డ్రా కార్యక్రమానికి రావలసి ఉంటుంది. ఈ లక్కీ డ్రా లో గెలిచిన విద్యార్థులకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు దొరుకుతుంది. ఆసక్తి గల విద్యార్థి,విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.