Hyderabad Public School : హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ గిరిజ‌న విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyderabad Public School : హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ గిరిజ‌న విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌

 Authored By ramu | The Telugu News | Updated on :2 April 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Hyderabad Public School : హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ గిరిజ‌న విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌

Hyderabad Public School : హైదరాబాద్ నగరంలోని Hyderabad Begumpet బేగంపేట, రామంతపూర్ ప్రాంతాల్లో గ‌ల హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ Hyderabad Public School విద్య‌న‌భ్య‌సించే గిరిజన విద్యార్థులకు రెండు ప్రత్యేక హాస్టళ్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు జీఓ ఆర్‌టీ నంబర్ 53 ప్రకారం గ‌డిచిన‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హాస్టళ్లు వచ్చే విద్యా సంవత్సరంలో (2025-26) ప్రారంభం అవుతాయి. బాల‌, బాలిక‌ల‌కు వేర్వేరు హాస్ట‌ళ్లు నిర్మించ‌నున్నారు. బేగంపేట హాస్టల్‌కు రూ.20.30 ల‌క్ష‌లు, అలాగే రామాంతపూర్ హాస్టల్‌కు రూ.1.33 కోట్లు ఖర్చు చేయ‌నున్న‌ట్లు గిరిజన సంక్షేమ శాఖ ప్రకటించింది.

Hyderabad Public School హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ గిరిజ‌న విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌

Hyderabad Public School : హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ గిరిజ‌న విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌

సీఎం రేవంత్‌రెడ్డి ఈ కీలక నిర్ణయం వెల్ల‌డిస్తూ గిరిజన విద్యార్థుల శిక్షణ కోసం ఇలాంటి ప్రత్యేకమైన హాస్టళ్లు నిర్మించడం విద్యార్థుల శ్రేయస్సులో భాగం అన్నారు. ఇది ఉగాది పండుగ సందర్భంగా గిరిజన విద్యార్థులకు గొప్ప కానుకగా భావించబడుతుంద‌న్నారు. విద్య‌పై పెట్టుబ‌డి అంటే మ‌న భ‌విష్య‌త్‌పై పెట్టుబ‌డే అన్నారు. ముఖ్యంగా గిరిజన విద్యార్థుల అభివృద్ధి కోసం ఇది ఒక శక్తివంతమైన అడుగు అని ఆయ‌న అభిప్రాయపడ్డారు.

ఈ హాస్టళ్లు విద్యార్థులకు సరైన వసతులను అందించడం, వారి చదువు మెరుగుపర్చడం, మరింత నాణ్యమైన విద్యను అందించడం కోసం డిజైన్ చేయబడతాయి. తద్వారా వారు ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే నిలిచిపోకుండా ఉంటుందన్నారు. ఈ విధానం గిరిజనుల అభ్యున్నతికి, ముఖ్యంగా విద్యారంగంలో గిరిజనుల సాధనలకు అండగా నిలుస్తుంద‌ని సీఎం పేర్కొన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది