CM Revanth Reddy : హైడ్రా స్పీడ్ మాములుగా లేదుగా.. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికే నోటీసులు
CM Revanth Reddy : హైదరాబాద్ నగరంలోని చెరువులను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలు, ప్రభుత్వ భూములు, నాలాలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థని ఏర్పాటు చేయడం మనం చూశాం. ప్రస్తుతం సామాన్యులతో పాటు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరికి హైడ్రా నోటీసులు పంపుతున్నారు. పేదలైనా, సెలబ్రిటీలైనా ఎవరైనా తనకు ఒక్కరే అని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో నిరూపించుకుంది హైడ్రా. ఈ క్రమంలో తాజాగా మరో సంచలనానికి తెర […]
CM Revanth Reddy : హైదరాబాద్ నగరంలోని చెరువులను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలు, ప్రభుత్వ భూములు, నాలాలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థని ఏర్పాటు చేయడం మనం చూశాం. ప్రస్తుతం సామాన్యులతో పాటు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరికి హైడ్రా నోటీసులు పంపుతున్నారు. పేదలైనా, సెలబ్రిటీలైనా ఎవరైనా తనకు ఒక్కరే అని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో నిరూపించుకుంది హైడ్రా. ఈ క్రమంలో తాజాగా మరో సంచలనానికి తెర తీసింది హైడ్రా. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులు జారీ చేసి.. మరోసారి వార్తల్లో నిలిచింది.
CM Revanth Reddy : సీఎం సోదరుడికే నోటీసులు..
ఎఫ్టీఎల్ జోన్‌లోనే తిరుపతి రెడ్డి నివాసం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసానికి కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. పలు కాలనీల్లోని కొన్ని నివాసాలకు నోటీసులు జారీ అయ్యాయి. మొత్తం 204 మందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులపై తిరుపతిరెడ్డి స్పందిస్తూ.. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసు విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. తాను 2017లో నివాసాన్ని కొనుగోలు చేసినప్పుడు ఈ భూమి ఎఫ్టీఎల్‌లో ఉందన్న సమాచారం తన దగ్గర లేదని చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఎఫ్టీఎల్‌లో ఉన్న భూములపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో తన బిల్డింగ్ కూడా ఆ పరిధిలో ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యతరం లేదని తిరుపతి రెడ్డి అన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేయించారు. అక్రమ కట్టడాలు నిర్మించింది ఎవరైనా సరే వదలబోమని కాంగ్రెస్ సర్కారు ముందు నుంచీ అంటోంది. మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వాటికి నోటీసులు జారీ చేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఆ అక్రమ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు.. అందుకు నెల రోజుల గడువు ఇచ్చారు.