Konda Murali : ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాను – కొండా మురళీ సంచలన వ్యాఖ్యలు
ప్రధానాంశాలు:
మరోసారి కొండా మురళీ హాట్ కామెంట్స్..పిక్ స్టేజికి వెళ్లిన కాంగ్రెస్ లో వర్గ పోరు
Konda Murali : ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం వర్గపోరు పిక్ స్టేజికి వెళ్తున్నాయి. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులపై ఆ ప్రాంతానికి చెందిన ఇతర కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో మాట్లాడిన మాటలు, పరస్పర విమర్శల నేపథ్యంలో పార్టీలో విభేదాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా కొండా మురళి చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Konda Murali : ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాను – కొండా మురళీ సంచలన వ్యాఖ్యలు
Konda Murali : కొండా మురళీ పై భగ్గుమంటున్న కాంగ్రెస్ నేతలు
ఒక ఆర్యవైశ్య సంఘం కార్యక్రమంలో పాల్గొన్న కొండా మురళి మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల గెలుపుకోసం తాను 16 ఎకరాల భూమిని అమ్మి, దాదాపు రూ. 70 కోట్ల వరకు ఖర్చు చేశానని వెల్లడించారు. తనకు 500 ఎకరాల భూమి ఉందని కూడా పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎవరి డబ్బూ తీసుకోలేదని, ఎవరిని ఇబ్బంది పెట్టలేదని చెప్పడం ద్వారా ఆయన తన స్వతంత్రతను, నైతికతను హైలైట్ చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోని ఇతర నేతలకు నచ్చలేదు. దీనిపై పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుల నేపథ్యంలో కొండా మురళిని పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణకు పిలిచింది. గాంధీభవన్ ఎదుట పెద్ద సంఖ్యలో కార్యకర్తల మద్దతుతో హాజరైన మురళి, ఆరు పేజీల వివరణాత్మక లేఖను కమిటీ ఛైర్మన్ మల్లు రవికి అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దని కోరారు. కార్యకర్తల సమస్యలపై స్పందించాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తన తపన అని పేర్కొన్నారు. మొత్తం మీద కొండా వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తిని బయటపెట్టగా, తదుపరి పరిణామాలు పార్టీ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
మొన్న ఎన్నికల్లో 16 ఎకరాలు అమ్మి రూ.70 కోట్లు ఖర్చు పెట్టిన
నాకు ఇంకా 500 ఎకరాల భూమి ఉంది
మీ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా నాకు వద్దు
– కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి pic.twitter.com/g98TEU7Pl1
— BIG TV Breaking News (@bigtvtelugu) June 30, 2025