Harish Rao : ఇదే జరిగితే హరీష్ రావు తిరగబడ్డం గ్యారెంటీ ?
Harish Rao తెలంగాణ రాజకీయాల్లో అతి త్వరలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతల నుండి తప్పుకుని తన కొడుకు కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా కూడా అన్ని బాద్యతలు కూడా కేటీఆర్ చూసుకుంటు ఉన్నాడు అనడంలో సందేహం లేదు. సీఎంగా లేని సమయంలోనే కేటీఆర్ ఇంత చేస్తే ఆయనే సీఎం అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు మంత్రులు కొందరు కేటీఆర్ ను బుజాన ఎత్తుకుని ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సమయంలో కొందరు హరీష్ రావు గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
హరీష్ రావు భయంతోనే కేటీఆర్ ముందస్తు సీఎం
టీఆర్‌ఎస్ పార్టీలో కేసీఆర్ అల్లుడిగా అడుగు పెట్టిన హరీష్ రావు అనూహ్యంగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. రాష్ట్రంలో ఆయనకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నియోజక వర్గంలో మెజార్టీ రికార్డును సాధిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో తన బలంను పెంచుకుంటూ వస్తున్నాడు. వచ్చే ఎన్నికల వరకు పార్టీలో మరియు రాష్ట్రంలో ఆయన బలం మరింతగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆయన తిరగబడక ముందే పార్టీకి వ్యతిరేకంగా మారక ముందే కేటీఆర్ ను సీఎం చేయడం ద్వారా సేఫ్ అవ్వొచ్చు అంటూ కేసీఆర్ భావిస్తున్నాడట.
కేటీఆర్ సీఎం అయితే మరి హరీష్ రావు..: Harish Rao
కేసీఆర్ మొదటి సారి సీఎం అయిన సమయంలో కీలకమైన భారీ నీటి పారుదల శాఖ ను హరీష్ రావుకు ఇవ్వడం జరిగింది. కాని ఆ తర్వాత హరీష్ రావు ప్రాముఖ్యత తగ్గేలా చేస్తూ వచ్చారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేకుండా ఆయనకు ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన సమయంలో హరీష్ రావుకు ఏమాత్రం సమాచారం ఇవ్వలేదు. ఇక సీఎంగా చేసే విషయమై ఇతర పార్టీ నాయకుల వద్ద చర్చలు జరుపుతున్నా ఇప్పటి వరకు హరీష్ రావు వద్ద మాత్రం కేసీఆర్ చర్చించలేదని తెలుస్తోంది. కేటీఆర్ సీఎం అయితే హరీష్ రావు ఎదిరించాలని చాలా మంది కోరుకుంటున్నారు. కేటీఆర్ క్యాబినేట్ లో హరీష్ రావుకు బెర్త్ ఉండక పోవచ్చు అంటున్నారు. ఒక వేళ అదే జరిగితే అప్పుడు హరీష్ రావు ఎదురు తిరిగి వచ్చే ఎన్నికల నాటికి ఏకు మేకై దిగే అవకాశం ఉందంటున్నారు.