Wife : అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్తనే చంపిన భార్య..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Wife : అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్తనే చంపిన భార్య..!

 Authored By ramu | The Telugu News | Updated on :5 July 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Wife : అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్తనే చంపిన భార్య..!

Wife  : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో కూలీ పనులు చేస్తూ జీవించేవారు. అయితే అక్కడే ధన్వాడ మండలానికి చెందిన ఓ యువకుడితో రాధ వివాహేతర సంబంధం పెంచుకుంది. ఈ విషయాన్ని గమనించిన భర్త అంజిలప్ప, భార్యను మందలించాడు. గ్రామానికి తిరిగి వెళదామని బతిమాలాడాడు.,చివరకు గ్రామానికి వెళ్లకుండా హైదరాబాద్‌ బాచుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద పని చేస్తూ గుడిసెలో నివసించడం మొదలుపెట్టారు.

Wife అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్తనే చంపిన భార్య

Wife : అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్తనే చంపిన భార్య..!

Wife : హైదరాబాద్ లో దారుణం.. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని గొంతు నులిమి హత్య చేసిన భార్య

ఇంతలోనే భర్త అంజిలప్ప తన భార్య మరోసారి ఆ యువకుడితో మాట్లాడుతున్నట్టు గమనించి తీవ్రంగా ఖంగుతిన్నాడు. వీరి మధ్య మాటా మాటా పెరిగి తరచూ గొడవలు మొదలయ్యాయి. గత నెల 23వ తేదీన అంజిలప్ప మద్యం తాగి నిద్రిస్తున్న సమయంలో, రాధ భర్తను గొంతు నులిమి హత్య చేసింది. ఆ తరువాత భర్త వేధించాడని నాటకం ఆడి, పక్కింటి వారికి భర్త చనిపోయాడని తెలిపింది.

అంజిలప్ప కుటుంబ సభ్యులు రాధపై అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరా ఆధారాలు సేకరించి రాధను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారించారు. విచారణలో తానే హత్య చేసినట్టు ఆమె అంగీకరించడంతో కేసును క్లారిఫై చేశారు. ప్రస్తుతం రాధ జైలులో ఉండగా, ఇద్దరు పిల్లలు తండ్రిని కోల్పోయి తల్లిని జైలులో కోల్పోయి అనాథలుగా మారిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది