Kadiyam Srihari : ఉద్యమకారులకు కేసీఆర్ అన్యాయం చేసిండు.. నేను పార్టీ మారితే వాళ్ల‌కెందుకు భ‌యం.. కడియం శ్రీహరి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kadiyam Srihari : ఉద్యమకారులకు కేసీఆర్ అన్యాయం చేసిండు.. నేను పార్టీ మారితే వాళ్ల‌కెందుకు భ‌యం.. కడియం శ్రీహరి

Kadiyam Srihari : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ ఎస్ కు అన్ని గడ్డు పరిస్థితులే వస్తున్నాయి. అటు కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లింది. ఇటు బీఆర్ ఎస్ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడివెళ్లిపోతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు ముందుగా వెళ్లగా.. ఆ తర్వాత సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీని వీడి వెళ్లిపోయారు. బీఆర్ ఎస్ లో ఉంటే లాభం లేదని వారు చెబుతూ వెళ్లిపోతున్నారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 March 2024,4:15 pm

ప్రధానాంశాలు:

  •  Kadiyam Srihari : ఉద్యమకారులకు కేసీఆర్ అన్యాయం చేసిండు.. నేను పార్టీ మారితే వాళ్ల‌కెందుకు భ‌యం.. కడియం శ్రీహరి

Kadiyam Srihari : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ ఎస్ కు అన్ని గడ్డు పరిస్థితులే వస్తున్నాయి. అటు కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లింది. ఇటు బీఆర్ ఎస్ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడివెళ్లిపోతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు ముందుగా వెళ్లగా.. ఆ తర్వాత సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీని వీడి వెళ్లిపోయారు. బీఆర్ ఎస్ లో ఉంటే లాభం లేదని వారు చెబుతూ వెళ్లిపోతున్నారు. ఇక మొన్ననే కేశవరావు కూడా వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు కడియం శ్రీహరి వంతు వచ్చింది. శ్రీహరి, ఆయన కూతురు కావ్య ఇద్దరూ పార్టీని వీడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

Kadiyam Srihari : స్టేషన్ ఘన్ పూర్ కార్యకర్తలతో కడియం శ్రీహరి సమావేశం

కావ్యకు బీఆర్ ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ప్రకటించింది. అయినా సరేవారు పార్టీని వీడి వెళ్లుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా స్టేషన్ ఘన్ పూర్ కార్యకర్తలతో కడియం శ్రీహరి సమావేశం నిర్వహిచారు. బీఆర్ఎస్ పార్టీలోనే వుంటే కార్యకర్తలకు, నియోజకవర్గ అభివృద్ధి చేసుకోలేమని కార్యకర్తలు తనకు చెప్పారని అంటున్నారు కడియం శ్రీహరి. ఇక పార్టీ మారుతున్న విషయంపై వారిని అభిప్రాయం కోరగా.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే తమ మద్దతు ఉంటుందని కార్యకర్తలు, నేతలు చెప్పినట్టు కడియం శ్రీహరి వెళ్లడించారు. అంతే కాకుండా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే బీఆర్ ఎస్ ను వీడి పసునూరి దయాకర్, అరూరి రమేష్ పార్టీ మారితే లేని అభ్యంతరం నా విషయంలో బీఆర్ఎస్ అభ్యంతరం ఎందుకు అని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తనకు సముచిత స్థానం కల్పించలేకపోయినా పార్టీలో ఉన్నట్టు తెలిపారు. అంతే కాకుండా ఇప్పుడు కూడా కాంగ్రెస్ నేతలే తన వద్దకు వచ్చి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారని తెలిపారు. తన కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. ఇప్పటి వరకు బీఆర్ ఎస్ లో ఉద్యమ కారులకు చేసింది ఏమీ లేదని కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇప్పటి వరకు ఉద్యమకారులను కూడా తన వద్దకు రానివ్వలేదని గుర్తు చేశారు. ఇప్పటి వరకు బీఆర్ ఎస్ లో చాలామందికి అన్యాయం జరిగిందని.. తనకు కూడా మళ్లీ పాత పరిస్థితులు రావొద్దనే ఉద్దేశంతోనే పార్టీ మారుతున్నట్టు తెలిపారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది