Kaleshwaram CAG Report : అసెంబ్లీలో కాక రేపుతున్న కాగ్ రిపోర్ట్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kaleshwaram CAG Report : అసెంబ్లీలో కాక రేపుతున్న కాగ్ రిపోర్ట్…!

 Authored By aruna | The Telugu News | Updated on :16 February 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Kaleshwaram CAG Report : అసెంబ్లీలో కాక రేపుతున్న కాగ్ రిపోర్ట్...!

Kaleshwaram CAG Report : అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ కాక రేపుతోంది. ప్రాణహిత ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదని నివేదిక తెలిపింది. ఇక దీనికోసం కేటాయించిన వ్యయం లో 878 కోట్లు వృధా అయ్యాయని రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. రీ ఇంజనీరింగ్ పేరుతో నిధులను దుర్వినియోగం చేశారని కాగ్ పేర్కొంది. ప్రాణహిత మీద 2022 నాటికి 1722 కోట్లు ఖర్చు చేశారని అలాగే కాలేశ్వరంపై 86,788 కోట్లు వ్యయం అయిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.

కాలేశ్వరం ప్రాజెక్ట్ పై అంతర్రాష్ట్ర సమస్యలు నిల్వ సామర్థ్యం , సౌకర్యంపై సరైన అధ్యయనం చేయలేదని కాగ్ పేర్కొంది. అస్తవ్యస్తంగా కాలేశ్వరం పనులను ప్రారంభించారని తెలియజేసింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ముప్పు సమస్యను కాగు ప్రస్తావించింది. ప్రాజెక్టు వ్యయం 122% పెరిగినప్పటికీటికీ ఆయకట్టు 52% మాత్రమే పెరిగిందని పేర్కొంది. కాలేశ్వరం ప్రాజెక్టు వడ్డీతో సహా కోటి 47,427 లక్షలు పెరిగిందని నివేదికలో కాగ్ పేర్కొంది. ప్రాణహిత ప్రాజెక్టు డిపిఆర్ కూడా లేదని చెప్పింది. పలు రకాల మార్పుల కారణంగా పనులు కూడా వృధా అయినట్లుగా తెలియజేసింది. దీంతో 767 కోట్ల నష్టం జరిగిందని కాగ్ నివేదికలో పేర్కొంది.

అలాగే కాలేశ్వరం డిపిఆర్ తయారుచేసిన వ్యాప్ కోస్ పని తీరుపై లోపాలు ఉన్నాయని కాగ్ స్పష్టం చేసింది. రీ ఇంజనీరింగ్ పనులు కూడా అదే సంస్థకు అప్పగించారని తెలియజేసింది. 2018లో కాలేశ్వరం డిపిఆర్ ను కేంద్ర జల సంఘం ఆమోదించక ముందే 17 రకాల పనులను 2549 కోట్లకు అప్పగించారని కాగ్ కుండబద్దలు కొట్టింది. డిపిఆర్ విడుదల చేసిన తర్వాత కూడా పనులలో మార్పులు చేశారని కాగ్ పేర్కొంది. ఈ క్రమంలోనే ముందుగా రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించిన ఆ తర్వాత అవసరం లేకపోయిన కూడా మూడు టీఎంసీలకు ప్రతిపాదన పెంచారని స్పష్టం చేసింది. దీంతో 28,151 కోట్లు అదనపు భారం పడిందని కాగ్ స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం కాగు నివేదిక అసెంబ్లీలో తీవ్ర దుమారం లేపుతుంది అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం అసెంబ్లీలో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది